రేవంత్ రెడ్డి చిల్లరగాడని, ఈసారి కొడంగల్‌లో ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. తాను ముషీరాబాద్ ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన దానిపై రేవంత్ రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు.

తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి నాయిని నర్సింహారెడ్డి.. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ పై సంచలన కామెంట్స్ చేశారు. తనపై రేవంత్ చేస్తున్న ఆరోపణలు నిజం కాదని నాయిని స్పష్టం చేశారు.

రేవంత్ రెడ్డి చిల్లరగాడని, ఈసారి కొడంగల్‌లో ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. తాను ముషీరాబాద్ ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన దానిపై రేవంత్ రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. పొరపాటున గత ఎన్నికల సందర్భంగా రూ.5, 10 లక్షలో కేసీఆర్‌ ఇస్తారన్నారనే బదులు రూ.10 కోట్లు అన్నానని వివరణ ఇచ్చారు. గత ఎన్నికలకు సంబంధించిన విషయాన్ని చెబితే ఈ ఎన్నికలకు ముడి పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ లాంటి వ్యక్తిని ప్రోత్సహిస్తే అది కాంగ్రెస్‌కే నష్టమని నాయిని తెలిపారు.