బక్క పలచని వ్యక్తిని ఎదుర్కోవడానికి మోసగాళ్లంతా కూటమిగా వస్తున్నారు.
మహాకూటమిపై హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వచ్చే నెలలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. కాగా.. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ భవన్ లో ఆశీర్వాద సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి నేతలపై విమర్శల వర్షం కురిపించారు.
Add Asianetnews Telugu as a Preferred Source

‘‘ఉద్యమంలో మేం లాఠీ దెబ్బలు తింటే కనీసం పరామర్శించడానికి రాలేదు.. పైగా తెలంగాణ ఇవ్వొద్దంటూ నిజాం కాలేజీలో సభ పెట్టారు. సిగ్గు లేదురా ప్రజలను ఓట్లు అడగడానికి’’ అంటూ టీడీపీ, కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
‘‘బక్క పలచని వ్యక్తిని ఎదుర్కోవడానికి మోసగాళ్లంతా కూటమిగా వస్తున్నారు. దమ్ము లేదారా? కలిసి రావడానికి.. ఒక్కరొక్కరుగా రండి’’అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
