దిక్కు మొక్కు లేని నాగర్ కర్నూల్ స్వాతి: ఇంకా స్టేట్ హోంలోనే...

https://static.asianetnews.com/images/authors/3800b66b-dc46-549b-a35e-91a1dbfb7895.jpg
First Published 24, Aug 2018, 3:18 PM IST
Nagar Kurnool Swathi in Mahaboob Nagar State Home
Highlights

ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తనే అత్యంత కిరాతకంగా హతమార్చిన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నాగర్ కర్నూల్ స్వాతి ప్రస్తుతం నరకం లాంటి జీవితాన్ని గడుపుతోంది. భర్తను చంపి అక్రమ సంబంధం నడిపిన వ్యక్తితో సుఖంగా ఉందా అంటే అదీ లేదు. ఇద్దరూ జైలుపాలయ్యారు. ఇక స్వాతి తల్లిదండ్రులు కూడా ఆమెను దగ్గరకు తీయడం కాదు కదా ఆమె పిల్లల్ని కూడా అప్పగించడం లేదు. ఇలా భర్త, ప్రియుడు, తల్లిందండ్రులు, పిల్లలు దూరమవడమే కాదు సమాజంలో నిందితురాలికి గుర్తింపు పొందిన స్వాతి ప్రస్తుతం స్టేట్ హోంలో ఓ అనాథలా దుర్భర జీవితాన్ని అనుభవిస్తోంది.

ప్రియుడి మోజులో పడి భర్త శ్రీనివాస్ రెడ్డిని కిరాతకంగా హతమార్చిన స్వాతి ఆ తర్వాత ఓ నాటకానికి తెరలేపింది. భర్త స్థానంలో ప్రియుడిని తీసుకురావాలని విశ్వ  ప్రయత్నం చేసింది. అయితే ఈ నాటకం బైటపడి స్వాతితో పాటు ప్రియుడు రాజేష్ కూడా కటకటాలపాలైన విషయం తెలిసిందే.

దీంతో తమ కూతురు చనిపోయినట్లుగా  భావిస్తున్నట్లు తెలిపిన స్వాతి తల్లిదండ్రులు ఆమె ఇద్దరు పిల్లల్ని పెంచేకుంటున్నారు. అయితే ఇటీవల స్వాతికి బెయిల్ లభించడంతో పిల్లలతో కలిసి జీవించాలని భావించింది. కానీ ఆమెకు పిల్లల్ని అప్పగించే ప్రసక్తే లేదని తల్లిదండ్రులు తెలిపారు. దీంతో ఎక్కడికి వెళ్లాలో, ఏం చేయాలో తెలియని స్వాతిని పోలీసులు స్టేట్ హోంకు తరలించి విషయం తెలిసిందే.

దీంతో అప్పటినుండి స్వాతి అక్కడే ఉంటోంది. తల్లిదండ్రులు, కన్న బిడ్డలు ఉన్నప్పటికి తాను చేసిన పాడు పనికి వారికి దూరంగా బ్రతకాల్సి వస్తోంది. నా అనేవారు లేక స్వాతి ఇంకా స్టేట్ హోం లోనే ఒంటరి జీవితం గడుపుతోంది. తప్పు చేశానని ఇప్పుడు ప్రాయశ్చిత్త పడ్డా ఆదుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఇలా చేసిన తప్పుకు జైలు శిక్షతో పాటు ఆ దేవుడి శిక్షను కూడా స్వాతి ప్రస్తుతం అనుభవిస్తోంది.
 
loader