Asianet News TeluguAsianet News Telugu

నేడు కాంగ్రెస్‌లోకి మైనంపల్లి:రేవంత్ తో కలిసి ఢిల్లీకి

మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. 

Mynampally hanumantha rao To join in Congress Today lns
Author
First Published Sep 28, 2023, 12:04 PM IST

హైదరాబాద్: మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు  గురువారంనాడు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ,ఆయన తనయుడు రోహిత్ రెడ్డిలు న్యూఢిల్లీకి వెళ్లారు. ఈ నెల 23వ తేదీన  మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు  బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. 

మల్కాజిగిరి , మెదక్ అసెంబ్లీ స్థానాలనకు కేటాయించాలని బీఆర్ఎస్ అధిష్టానాన్ని మైనంపల్లి హన్మంతరావు కోరారు. అయితే  మల్కాజిగిరి అసెంబ్లీ స్థానాన్ని మాత్రమే  మైనంపల్లి హన్మంతరావుకు  బీఆర్ఎస్ నాయకత్వం కేటాయించింది.  మెదక్ టిక్కెట్టు విషయంలో  బీఆర్ఎస్ నాయకత్వం నుండి సానుకూల స్పందన రాలేదు. దీంతో  కాంగ్రెస్ పార్టీలో చేరాలని  మైనంపల్లి హన్మంతరావు నిర్ణయం తీసుకున్నారు.   ఈ మేరకు  టీపీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో కలిసి మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావులు  ఢిల్లీ వెళ్లారు. ఇవాళ సాయంత్రం కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల సమక్షంలో మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్ పార్టీలో చేరుతారు. 

also read:నాడు మల్కాజిగిరి, నేడు మెదక్ కోసం: మైనంపల్లి పయనమెటు?

2009లో మెదక్ నుండి మైనంపల్లి హన్మంతరావు టీడీపీ అభ్యర్ధిగా విజయం సాధించారు. 2014  ఎన్నికలకు ముందు  మైనంపల్లి హన్మంతరావు బీఆర్ఎస్ లో చేరారు.  2014లో మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన  బీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.  2018 నుండి మల్కాజిగిరి నుండి బీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు.  2023లో మల్కాజిగిరి నుండి  మైనంపల్లి హన్మంతరావుకు  టిక్కెట్టు దక్కింది. అయితే మెదక్ అసెంబ్లీ స్థానం నుండి  తనయుడు రోహిత్ కు  బీఆర్ఎస్ దక్కలేదు.దీంతో  మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్ లో చేరనున్నారు.రెండు టిక్కెట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ నాయకత్వం కూడ సుముఖంగా ఉంది. దీంతో మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios