మైనంపల్లి ఇంటికి కాంగ్రెస్ నేతల క్యూ.. హస్తం గూటికి చేరేందుకు ముహుర్తం ఖరారు..
మాజీ బీఆర్ఎస్ నేత, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్ గూటికి చేరేందుకు ముహుర్తం ఖరారు అయింది.

మాజీ బీఆర్ఎస్ నేత, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్ గూటికి చేరేందుకు ముహుర్తం ఖరారు అయింది. ఇటీవల బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పిన మైనంపల్లి హన్మంతరావును కాంగ్రెస్ సీనియర్ నేతలు వారి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ మేరకు ఆయన ఇప్పటికే ఓ నిర్ణయానికి కూడా వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ నెల 27న ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతల సమక్షంలో మైనంపల్లి హన్మంతరావు పార్టీ కండువా కప్పుకోనున్నట్టుగా సమాచారం. ఇందుకోసం ఆయన రేపు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు.
ఇదిలాఉంటే, ఇప్పటికే మైనంపల్లి హన్మంతరావు ఇంటి వద్ద కాంగ్రెస్ నాయకుల, శ్రేణుల సందడి నెలకొంది. ఈరోజు దామోదర రాజనర్సింహ, అంజన్ కుమార్ యాదవ్‌లు కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు.. మైనంపల్లి హన్మంతరావుతో చర్చిస్తున్నారు. మరికాసేపట్లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు మరికొందరు కాంగ్రెస్ నేతలు కూడా మైనంపల్లి హన్మంతరావు ఇంటికి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా మైనంపల్లిని కాంగ్రెస్‌లో చేరాల్సిందిగా ఆహ్వానించనున్నారు.