Asianet News TeluguAsianet News Telugu

మోడీతో కలవం, జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషిస్తాం:కేటీఆర్

రాబోయే రోజుల్లో జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ పాత్ర క్రియాశీలకం కాబోతుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మరోసారి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్ లో మంత్రి కేటీఆర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ మైనారిటీ నేతలు అబిద్ రసూల్ ఖాన్ ,ఖలీల్ ఉర్ రెహమాన్ ,వారి అనుచరులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు.  

Muslim leaders joins trs party in the presence of ktr
Author
Hyderabad, First Published Nov 16, 2018, 6:36 PM IST

హైదరాబాద్: రాబోయే రోజుల్లో జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ పాత్ర క్రియాశీలకం కాబోతుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మరోసారి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్ లో మంత్రి కేటీఆర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ మైనారిటీ నేతలు అబిద్ రసూల్ ఖాన్ ,ఖలీల్ ఉర్ రెహమాన్ ,వారి అనుచరులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు.  

టీఆర్ఎస్ పార్టీలో ముస్లిం నేతలు చేరడాన్ని తాము స్వాగతిస్తున్నట్లు కేటీఆర్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్, బీజేపీల మధ్య స్నేహం ఉందని ఆరోపిస్తున్న టీడీపీ, కాంగ్రెస్ నేతలకు తాజా చేరికలు చెంప చెళ్లు మనిపించాయన్నారు. 

టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మైనార్టీలకు 200కు పైగా రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేిన ఘనత కేసీఆర్ దేనన్నారు. షాదీ ముబారక్ పథకంతో పేద ముస్లింలకు అండగా నిలిచారని కేటీఆర్ తెలిపారు. ముస్లిం పండుగలను ఘనంగా జరుపుకోవడానికి చేయూతనిచ్చింది కేసీఆర్ మాత్రమేనన్నారు. కేసీఆర్ ను మించిన లౌకిక వాది మరోకరు ఉండరన్నారు. 

ఎక్కడా లేనివిధంగా సిద్ధిపేటలో ఇక్బల్ మీనార్ మెుట్టమెుదటిగా కట్టించింది కేసీఆర్ అని కేటీఆర్ గుర్తు చేశారు. వంద సీట్లలో గెలిచి కేసీఆర్ మరోసారి సీఎం కాబోతున్నారన్నారు. బీజేపీకి, టీఆర్ఎస్ కు సిద్ధాంతపరమైన విరోధం ఉందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మైనారిటీలకు మరిన్ని అభివృద్ధి పథకాలు తీసుకువస్తామని తెలిపారు.

తాను మూడేండ్ల కిందట కండ్లు తెరచి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చానని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ను ఖాళీ చేయాల్సిన అవసరం ఉందన్నారు. 2019 లోనే కాదు మరో 20 యేండ్లు టీఆర్ఎస్ పార్టీయే గెలుస్తుందన్నారు. కేసీఆర్ సీఎంగా ఉంటారని ఆయనకు హిందువులు, ముస్లింలు రెండు కళ్లు అన్నారు. 

మరోవైపు 32 ఏళ్లపాటు కాంగ్రెస్ పార్టీలో తాను పనిచేశానని తన తండ్రి సైతం కాంగ్రెస్ పార్టీలో పనిచేసిందని మైనార్టీ నేత అబిద్ రసూల్ ఖాన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఆర్ఎస్ఎస్ కనుసన్నుల్లో నడుస్తోందని ఆరోపించారు. ముస్లింలు ఎన్నికల్లో గెలవరని  చెప్తూ కాంగ్రెస్ వారికి టిక్కెట్లు ఇవ్వడం లేదన్నారు. 

వక్ఫ్ బోర్డు ఆస్తులను స్వాహా చేసిన షబ్బీర్ అలీ కి కాంగ్రెస్ ప్రాధాన్యత ఇస్తోందని మండిపడ్డారు. 3 సార్లు ఓడిన షబ్బీర్ కు టిక్కెట్ ఎలా ఇస్తారని నిలదీశారు. క్రిమినల్ కేసులు ఉన్న వారికే కాంగ్రెస్ టిక్కెట్లు ఇచ్చిందని మండిపడ్డారు. త్వరలోనే షబ్బీర్ అలీ భండారం బయటపెడతానని తెలిపారు. 

ముస్లింలకు రాజకీయంగా పెద్ద పీట వేస్తున్న పార్టీ టీఆర్ఎస్ ఒక్కటేనని కొనియాడారు. ముస్లింలకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి గౌరవించిందని అందుకే తామంతా టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు తెలిపారు. 

కాంగ్రెస్ ను టీడీపీ కంట్రోల్ చేస్తోందని మెున్నటి వరకు బీజేపీతో ఉన్న చంద్రబాబును ముస్లింల ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. టీఆర్ఎస్ బీజేపీకి ఎలాంటి సంబంధాలు లేవని కాంగ్రెస్ ఇంత దిగజారి ప్రవర్తిస్తుందని ఊహించలేదన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ జోకర్ల పార్టీగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios