Asianet News TeluguAsianet News Telugu

సహృదయం : అనాథ వృద్ధుడికి అంత్యక్రియలు నిర్వహించిన ముస్లిం దంపతులు.. !

వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట మండలం, ఉప్పరపల్లి గ్రామానికి చెందిన అనుమాండ్ల వీరస్వామి-శోభ భార్యభర్తలు. వీరికి పిల్లలు లేరు, కూలి నాలి చేసుకుంటూ జీవనం సాగించే వారు. కనీసం సొంత ఇల్లు కూడా లేదు, ఆ అనే వాళ్ళు లేక శోభ గ్రామంలోని పలు ఇళ్లల్లో ఇంటి పనిచేస్తుంది. కాగా భర్త వృద్యాప్యం కారణంగా పూట గడవడం కష్టంగా మారింది.

muslim couple did last rituals to a orphaned old couple in warangal - bsb
Author
Hyderabad, First Published Apr 10, 2021, 11:05 AM IST

వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట మండలం, ఉప్పరపల్లి గ్రామానికి చెందిన అనుమాండ్ల వీరస్వామి-శోభ భార్యభర్తలు. వీరికి పిల్లలు లేరు, కూలి నాలి చేసుకుంటూ జీవనం సాగించే వారు. కనీసం సొంత ఇల్లు కూడా లేదు, ఆ అనే వాళ్ళు లేక శోభ గ్రామంలోని పలు ఇళ్లల్లో ఇంటి పనిచేస్తుంది. కాగా భర్త వృద్యాప్యం కారణంగా పూట గడవడం కష్టంగా మారింది.

పేదస్థితిలో చెట్టు కింద ఉండి జీవనం సాగిస్తున్న వీరి మీద రెండేళ్లక్రితం.. 2019లో  వీరి దీనగాధ ప్రచురితయ్యింది. ఇది చూసిన చూసిన మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు, స్వఛ్చంద  సేవకులు, గ్రామస్తులు హన్మకొండ ప్రశాంత్ నగర్ లోని "సహృదయ అనాథ వృద్ధ ఆశ్రమ" నిర్వాహకురాలు చోటు-యాకూబీలకు సమాచారం అందించారు.

ఆమె వెంటనే స్పందించి ఆ వృద్ధ దంపతులను  ఆశ్రమానికి  తీసుకొచ్చారు. ఆశ్రమ నిర్వాహకులు గత రెండు సంత్సరాలుగా ఆ వృద్ధ దంపతుల ఆలన, పాలన చూసుకున్నారు.

ఈ క్రమంలో శుక్రవారం నాడు ఉదయం వీరస్వామి(80) గుండెపోటుతో మరణించాడు. నా అనే వారు లేకపోవడంతో, ఉన్న బంధువులు కూడా రాకపోవడంతో సహృదయ అనాథ వృద్ధ ఆశ్రమ నిర్వాహకులు చోటు-యాకూబీ లు దగ్గరుండి హిందూ సాంప్రదాయం ప్రకారం వీరస్వామి అంత్యక్రియలు నిర్వహించారు. 

స్వయంగా యాకూబీ కుండ చేత పట్టి, చితికి నిప్పంటించి దహన సంస్కారాలు పూర్తి చేశారు. ఎవరూ లేని వీరస్వామి అంత్యక్రియలు నిర్వహించినందుకు యాకూబీ-చోటు దంపతులను పలువురు అభినందించి ప్రశంసించారు.

Follow Us:
Download App:
  • android
  • ios