హైదరాబాద్ వరుస హత్యలతో వణికిపోతోంది.. పట్టపగలు.. నడిరోడ్డు మీద జనం చూస్తుండగానే నరహంతకులు.. తమ ప్రత్యర్థులను అత్యంత పాశవికంగా హతమారుస్తున్నారు.
హైదరాబాద్ వరుస హత్యలతో వణికిపోతోంది.. పట్టపగలు.. నడిరోడ్డు మీద జనం చూస్తుండగానే నరహంతకులు.. తమ ప్రత్యర్థులను అత్యంత పాశవికంగా హతమారుస్తున్నారు. తాజాగా హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్‌బోర్డ్ కార్యాలయం ఎదురుగా ఉన్న అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో గుర్తు తెలియని యువకుడిని అత్యంత కిరాతకంగా హత్య చేశారు.
మృతుడి వయసు 28 సంవత్సరాలు ఉంటుందని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్లూస్ టీం సాయంతో ఆధారాల కోసం పరిశీలిస్తున్నారు. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.
