హైదరాబాద్ (hyderabad) చాంద్రాయణ గుట్టలో (chandrayangutta) దారుణం జరిగింది. పట్టపగలు నడిరోడ్డుపై ఓ వ్యక్తిని నరికి చంపారు దుండగులు. కారులో వెళ్తున్న వ్యక్తిని వెంటాడి చంపారు. కారుని అడ్డుకుని బాధితుడిని బయటకి లాక్కొచ్చి కత్తులతో విచక్షణారహితంగా నరికారు. ఆపై బండరాయితో కొట్టి అతనిని హత్య చేశారు.
హైదరాబాద్ (hyderabad) చాంద్రాయణ గుట్టలో (chandrayangutta) దారుణం జరిగింది. పట్టపగలు నడిరోడ్డుపై ఓ వ్యక్తిని నరికి చంపారు దుండగులు. కారులో వెళ్తున్న వ్యక్తిని వెంటాడి చంపారు. కారుని అడ్డుకుని బాధితుడిని బయటకి లాక్కొచ్చి కత్తులతో విచక్షణారహితంగా నరికారు. ఆపై బండరాయితో కొట్టి అతనిని హత్య చేశారు. అతను చనిపోయాడు అని నిర్ధారించుకున్న తర్వాతే అక్కడి నుంచి వెళ్లారు. జనం చూస్తుండగానే హత్య చేసి పారిపోయారు దుండగులు. మృతుడిని మొగల్‌పురాకు (moghalpura) చెందిన హమీద్‌గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాపతు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
