Asianet News TeluguAsianet News Telugu

Munugodu: సీఎం కేసీఆర్ కు కేఏ.పాల్ బహిరంగ సవాల్.. !

KA Paul: మునుగోడు ప్ర‌జ‌లు సీఎం కేసీఆర్ కు త‌గిన బుద్ది చెబుతార‌ని కేఏ.పాల్ అన్నారు. రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల రక్తాన్ని  జలగల పీల్చుకు తింటున్న కేసీఆర్ అండ్ ఆయ‌న దండుపాళ్యం ముఠాను ఓటుతో తరిమికొట్టాల‌ని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. మునుగోడు ప్రజలు ఇచ్చే తీర్పు.. తెలంగాణ ప్రజాల భవిష్యత్ కు మార్పు అవ్వాల‌ని పేర్కొన్నారు.
 

Munugodu by-election: KA Paul's open challenge to CM KCR
Author
First Published Oct 26, 2022, 12:46 PM IST

Munugodu by-election: మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక స‌మ‌యం ద‌గ్గ‌ర‌పడుతున్న కొద్ది రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. ఓట‌ర్ల‌ను త‌మ‌వైపుకు తిప్పుకోవ‌డానికి రాజ‌కీయ పార్టీలు అన్ని అవ‌కాశాల‌ను ఉప‌యోగించుకుంటున్నాయి. ఆయా పార్టీల నాయ‌కులు చేసుకుంటున్న ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు, స‌వాళ్లు రాజ‌కీయాల‌ను హీటెక్కిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ప్ర‌జా శాంతి పార్టీ నాయ‌కుడు కేఏ.పాల్.. రాష్ట్ర ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తూ.. ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు బ‌హిరంగ స‌వాలు విసిరారు. "గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చినవో చెప్పాకే మునుగోడుకు రండి... నేను మునుగోడు లోనే ఉన్న.. దమ్ముంటే మునుగోడు లో బహిరంగ చర్చ కి నేను సిద్ధం, నువ్వు సిద్ధమా కేసీఆర్..?" అంటూ కేఏపాల్ స‌వాలు విసిరారు. మునుగోడులో గెలుపు త‌మ పార్టీదే నంటూ ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు. "ఇండియా-పాకిస్తాన్ తాజా మ్యాచ్ లో భారత్ ఎలా గెలిచిందో... మునుగోడు లో జరగబోయే యుద్ధంలో గెలుపు నాదే.." అంటూ కేఏపాల్ ధీమా వ్య‌క్తం చేశారు. 

మునుగోడు ప్ర‌జ‌లు ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు త‌గిన బుద్ది చెబుతార‌ని  పేర్కొన్నారు. రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల రక్తాన్ని  జలగల పీల్చుకు తింటున్న  కేసీఆర్ అండ్ ఆయ‌న దండుపాళ్యం ముఠాను ఓటుతో తరిమికొట్టాల‌ని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. మునుగోడు ప్రజలు ఇచ్చే తీర్పు.. తెలంగాణ ప్రజాల భవిష్యత్ కు మార్పు అవ్వాల‌ని ఆయ‌న పేర్కొన్నారు. మునుగోడు ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఆయ‌న నిర్వ‌హించిన రోడ్డు షో లో కేఏపాల్ పై వ్యాఖ్య‌లు చేశారు. "మునుగోడు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తే సమాధానం చెప్పలేని కేసీఆర్.. అతని చెడ్డి గ్యాంగ్ దమ్ముంటే బహిరంగ చర్చ కు రావాలి" అని డిమాండ్ చేశారు. అహంకారం తలకెక్కిన కేసీఆర్ ను ఓడించాలని మునుగోడు ప్రజలను కోరారు. భారత్ -పాకిస్తాన్ మ్యాచ్ లో భారత్ గెలిస్తే ప్రజలు సంబురాలు చేసుకున్నారో.. నవంబర్ 3న జరిగే ఎన్నికల్లో ఏకే.పాల్ ని గెలిపించి... తెలంగాణ బలిసిన వర్గాలది కాదు బలహీన వర్గాలది అని ఓట్లతో  తీర్పు ఇవ్వాలని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు.

చండూరు మండల కేంద్రంలో జరిగిన రోడ్ షోకు హాజరైన జన సందోహాన్ని ఉద్దేశించి కేఏ.పాల్ మాట్లాడుతూ.. దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితుల ఆత్మగౌరవాన్ని  అవమానించిన మూర్ఖుడు కేసీఆర్ కు మునుగోడు ప్రజలు గుణపాఠం చెప్పాలి అంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. "మునుగోడుకు కేసీఆర్ చెడ్డి గ్యాంగ్  వచ్చింది. దోచుకునేందుకు సిద్ధమైంది. మందు, మాంసం, మనీ తో ఓట్లు దండుకునేందుకు సిద్దమైన  గ్యాంగ్ కు గుణపాఠం చెప్పాల్సిన సమయం వచ్చింది" అని అన్నారు. "యావత్ తెలంగాణ ప్రజల రక్తం పీల్చి దోచుకున్న సొమ్ముతోనే కేసీఆర్ ఓట్లు కొంటున్నడు.. కోట్లు కుమ్మరిస్తున్నాడు . బీజేపీ,కాంగ్రెస్, టీఆర్ఎస్ ఏ పార్టీ డబ్బులు ఇచ్చినా తీసుకోండి.. వారు పంచే ప్రతి రూపాయి మన సొంత డబ్బే, ఆ డబ్బులన్నీ మనవే.. తీసుకోండి" అని పాల్ అన్నారు.  

ఎంతోమంది ఆత్మ బలిదానాలతో కలలు కనిపిచ్చుకున్న బంగారు తెలంగాణ కానీ కేసీఆర్ కుటుంబం భోగాలు అనుభవిస్తోందని విమ‌ర్శించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన ఫేక్ హామీలెన్ని నెరవేర్చినవో సమాధానం చెబితేనే కేసీఆర్  మునుగోడులో తిరగనియ్యండి... లేదంటే తరిమి కొట్టండి.. అంటూ మండిప‌డ్డారు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఆత్మగౌరవ ఎన్నిక ఇది అని కేఏ.పాల్ పేర్కొన్నారు.  కర్షకులకు, కార్పొరేట్ నాయకులకు మధ్య జరిగే పోరాటమ‌ని అన్నారు. నిలువనీడలేకుండా బతుకులీడుస్తున్న పేదల భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నిక అని పేర్కొన్నారు. అధికార యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకొని, తెరాస, బీజేపీ నాయకులు ఆడే నాటకాలు ఇక సాగవు.. అంటూ విమ‌ర్శించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios