Munugodu by-election: మునుగోడు ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థి కొమటి రెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై కాంగ్రెస్ నేత మధుయాష్కీ తీవ్ర విమర్శలు గుప్పించారు. పైసా లేని సుశీ ఇన్‌ఫ్రా కంపెనీకి రూ.18 వేల కోట్ల ప్రాజెక్టు ఎలా వచ్చింది? అని ప్రశ్నిస్తూ దీనికి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
Congress leader MadhuYashki: మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు కాకరేపుతున్నాయి. ఈ ఎన్నికకు కారణమైన మాజీ కాంగ్రెస్ నాయకుడు, మునుగోడు ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థి కొమటి రెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. మొదటి నుంచి ఆయన తీరుపై ఇతర పార్టీల నాయకులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కాంట్రాక్టుల కోసమే కొమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ వీడి బీజేపీలో చేరానని కాంగ్రెస్ నేతలతో పాటు అధికార పార్టీ టీఆర్ఎస్ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. డబ్బుల కోసం కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నాయకుడు మధుయాష్కీ.. బీజేపీ మునుగోడు అభ్యర్థి అభ్యర్థి కొమటి రెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయనకు చెందిన పైసా లేని సుశీ ఇన్‌ఫ్రా కంపెనీకి రూ.18 వేల కోట్ల ప్రాజెక్టు ఎలా వచ్చింది? అని ప్రశ్నిస్తూ దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
మధుయాష్కీ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ఆపరేషన్ బొగ్గు పేరుతో ఆదివారం ఒక డాక్యుమెంట్ విడుదల చేశారు. పార్టీమార్పు నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డికి బొగ్గు గనుల టెండర్ ఇచ్చిందని బీజేపీపై మండిపడ్డారు. ఒక్కపైసా లేని, నష్టాల్లో ఉన్న కంపెనీకి రూ.18వేల కోట్ల కాంట్రాక్ట్ ఎలా వచ్చిందని చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాజగోపాల్ రాజకీయమంతా బ్యాక్‌డోర్ లాబీయింగ్ లతో నిండిపోయిందని విమర్శించారు. ప్రజలు మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ, టీఆర్ఎస్ లకు తగిన గుణపాఠం చెప్పాలని సూచించారు. అంతకుముందు ఒక న్యూస్ ఛానెల్ డిబెట్ లో రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ తన కంపెనీకి దక్కిన వేల కోట్ల రూపాయల టెండర్ గురించి చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ఇతర పార్టీల నాయకుడు, ఆయనను, బీజేపీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. తాజాగా మధుయాష్కీ పై వ్యాఖ్యలు చేశారు.
కొమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆయనకు చెందిన కంపెనీ, బీజేపీ తీరును ప్రశ్నిస్తూ మధుయాష్కీ విమర్శలు గుప్పించారు. బీజేపీ క్విడ్ ప్రో కో వల్లే అదానీకి ఇవ్వాల్సిన ప్రాజెక్ట్ సుశీ ఇన్ ప్రాకు దక్కిందని మధు యాష్కీ ఆరోపించారు. వ్యాపార ప్రయోజనాలు పొందడం కోసమే ఆయన పార్టీ మారారని మండిపడ్డారు. నష్టాల్లో కురుకుపోయిన తన కంపెనీని లాభాల్లోకి తెచ్చుకునేందుకే.. రాజగోపాల్‌రెడ్డి బీజేపీతో బేరసారాలు జరిపి పార్టీ మారాని ఆరోపించారు. దగా కోరులై రాజకీయాను చేస్తున్నారని మండిపడ్డారు. బడుగుబలహీన వర్గాల వారు, అగ్రవర్ణాలలోని పేదలు రాజకీయం చేసుకోలేని విధంగా రాజకీయాలను మారుస్తున్నారని విమర్శించారు. "బడుగుబలహీన వర్గాల రాజ్యధికార భాగస్వామ్య ఉండాలంటే మునుగోడు ఎన్నికల తీర్పు... బీజేపీ, టీఆర్ఎస్ ల దౌడ పగిలేటట్టు ఉండాలి. దగా చేసేటోడు దత్తత తీసుకుంటా అని అంటున్నాడు.. వ్యాపారం కోసం రాజకీయలు చేసుకునెటోడో ఆత్మ గౌరవ పోరాటం అంటడు" అని టీఆర్ఎస్, బీజేపీ నేతలను పరోక్షంగా ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు. తెలంగాణను ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ అనీ, ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆయన కోరారు.
