మునుగోడు ఉప ఎన్నిక చరిత్ర సృష్టిస్తుంది: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మునుగోడు ఉప ఎన్నిక చరిత్ర సృష్టించనుందని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి పాలైతే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందన్నారు.
మునుగోడు: మునుగోడు ఉప ఎన్నిక చరిత్ర సృష్టించనుందని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అ:భిప్రాయపడ్డారు.బుధవారం నాడు ఆయన మునుగోడులో మీడియాతో మాట్లాడారు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో కేసీఆర్ సర్కార్ దిగొచ్చిందన్నారు. తాను రాజీనామా సమర్పించగానే నియోజకవర్గంలో రోడ్లతో పాటు పలు పనులు ప్రారంభించారనిఆయన గుర్తు చేశారు.మునుగోడు ఎన్నికల పలితాన్ని బట్టి కేసీఆర్ ముందస్తుకు వెళ్లే అవకాశం ఉందన్నారు.
ఈ నెల 2వ తేదీన మునుగోడు ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు.ఈ నెల 4వ తేదీన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియాగాంధీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా లేఖను పంపారు. ఈ నెల 8వ తేదీన మునుగోడు ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా సమర్పించారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామాను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆమోదించారు. ఆరు మాసాల్లోపుగా ఈ స్థానానికి ఎన్నికలు జరగాల్సిన అనివార్య పరిస్థితి నెలకొంది.ఇదిలా ఉంటే ఈ నెల 21న కేంద్ర మంత్రి అమిత్ షా సమక్షంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారు. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాత్రం తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని ప్రకటించారు.
మునుగోడులో బీజేపీ అభ్యర్ధిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలోకి దిగనున్నారు. గతంలో కోమటిరడ్డి రాజగోపాల్ రెడ్డి భువనగిరి ఎంపీ, ఎమ్మెల్సీగా పనిచేశారు. 2018 ఎన్నికల్లో మునుగోడు నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. త్వరలో జరిగే ఉప ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేయనున్నారు.
also read:మునుగోడు ఉప ఎన్నికలు 2022: రేపటి నుండి కాంగ్రెస్ ప్రచారం
రేపటి నుండి కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంలో ప్రచారాన్ని ప్రారంభించనుంది. కాంగ్రెస్ అగ్రనేతలు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. కాంగ్రెస్ కు కీలక నేతలకు మండలాలవారీగా ఇంచార్జీ బాధ్యతలను అప్పగించింది కాంగ్రెస్ నాయకత్వం. సెప్టెంబర్ 3న రేవంత్ రెడ్డి సహా కీలక నేతలు నియోజకవర్గంలో పర్యటించనున్నారు.