మునుగోడు బైపోల్ 2022: గట్టుప్పల్‌లో రూ.3 లక్షలు,మద్యం సీజ్

గట్టుప్పల్ లోని ఓ ఇంట్లో మద్యం,  నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఓటర్లను ప్రలోభపెట్టేందుకుఈ నగదు, మద్యం  పంపిణీ  చేస్తున్నారని అందిన ఫిర్యాదు మేరకుఅధికారులు దాడులుచేశారు. 

Munugode bypoll2022 :Police Seizes Rs. 3 Lakhs and liquor in Gattuppal

మునుగోడు: మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలోని గట్టుప్పల్ మండలకేంద్రంలోని ఓ ఇంట్లో  గురువారంనాడు మధ్యాహ్నం రూ.3 లక్షల నగదు, మద్యం బాటిల్స్ ను ఫ్లయింగ్ స్క్వాడ్  అధికారులు స్దాదీనం చేసుకన్నారు.  ఓటింగ్ సమయంలో ఓటర్లను ప్రలోభాలు పెట్టేందుకు డబ్బు, మద్యం పంచుతున్నారనే పిర్యాదు మేరకు ఫ్టయింగ్ స్క్వాడ్  బృందం  ఈ నగదును,మద్యం బాటిల్స్ ను సీజ్  చేశారు. ఈ విషయమై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ఓటర్లను ప్రలోభపెడుతున్నాయని  బీజేపీ,టీఆర్ఎస్ లు  ఇవాళ ఉదయం నుండి పరస్పరం ఫిర్యాదు చేసుకుంటున్నాయి. స్థానికేతరనేతలు ఇంకా నియోజకవర్గంలో ఉన్నారని బీజేపీ టీఆర్ఎస్ పై  ఫిర్యాదు చేసింది.  బీజేపీపై టీఆర్ఎస్ కూడ ఈసీకి  కంఫ్లైంట్ ఇచ్చింది.

also read:రోడ్డు కోసం: రంగంతండాలో ఓటింగ్ ను బహిష్కరించిన గ్రామస్తులు

ఓటర్లను పోలింగ్ కేంద్రం వద్దకు తీసుకువచ్చి తమకు అనుకూలంగా ఓటు వేసేలా  పార్టీల నేతలు  ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓటర్లకు  మద్యం,నగదును ఇస్తున్నారనే  ఆరోపణలున్నాయి.మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఓటర్లలో ఎక్కువ భాగం హైద్రాబాద్ లో నివాసం ఉంటున్నారు.ఓటు హక్కును వినియోగించుకొనేందుకుు ఓటర్లు తమ స్వగ్రామాలకు చేరుకున్నారు.

ఈ ఏడాది ఆగస్టు 8వ తేదీన మునుగోడు ఎమ్మెల్యే పదవికి కాంగ్రెస్ కోమటిరెడ్డి రాజగోపాల్  రెడ్డి రాజీనామా  చేశారు. దీంతో ఈ స్థానానికి ఇవాళ ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే  పదవికి రాజీనామా  చేయడానికి నాలుగు రోజుల ముందే కోమటిరెడ్డి రాజగోపాల్  రెడ్డి కాంగ్రెస్  పార్టీకి  రాజీనామా  చేశారు.  అదే నెల 21న బీజేపీలో చేరారు. 2018లో కాంగ్రెస్ అభ్యర్ధిగా ఈ స్థానం నుండి  కోమటిరెడ్డి రాజగోపాల్   రెడ్డి విజయం  సాధించారు. ఈ దఫా  బీజేపీ అభ్యర్ధిగా బరిలో కి దిగారు. కాంగ్రెస్ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతి, టీఆర్ఎస్ అభ్యర్ధిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పోటీలో  ఉన్నారు. ఈ  నియోజకవర్గంలో 2,41855 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు  అధికారులు ఏర్పాట్లు చేశారు. మునుగోడు  ఉప ఎన్నికల్లో  47 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు.  47  మందిలో  ప్రధానంగా మూడు పార్టీల మధ్య పోటీ  నెలకొంది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios