మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. మొత్తం 15 రౌండ్లకు గానూ 11 రౌండ్ల కౌంటింగ్ పూర్తైంది. అయితే టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతుండటంతో.. ఆ పార్టీ శ్రేణులు ముందుగానే సంబరాల్లో మునిగిపోయారు.
మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. మొత్తం 15 రౌండ్లకు గానూ 11 రౌండ్ల కౌంటింగ్ పూర్తైంది. అయితే టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. దీంతో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. కూసకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం ఖాయమైందని ఆనందంలో మునిగి తేలుతున్నారు. హైదరాబాద్‌లోని తెలంగా భవన్‌కు భారీగా చేరుకుంటున్న టీఆర్ఎస్ శ్రేణులు.. బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకుంటున్నారు. స్వీట్లు పంచుకుంటున్నారు. దేశ్ కీ నేత కేసీఆర్ అంటూ నినాదాలు చేస్తున్నారు. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. మరికాసేపట్లో టీఆర్ఎస్ ముఖ్య నాయకులు తెలంగాణ భవన్‌కు చేరుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఇక, మునుగోడు ఉపఎన్నిక కౌంటింగ్ విషయానికి వస్తే.. అక్కడ బీజేపీ, టీఆర్ఎస్ మధ్య హోరా హోరీ పోరు కొనసాగుతుంది. 11 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుట్ల ప్రభాకర్ రెడ్డి.. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై 5,700కు పైగా ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరో నాలుగు రౌండ్ల ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది.
