Asianet News TeluguAsianet News Telugu

మునుగోడు బైపోల్ 2022: చండూరులో టీఆర్ఎస్, బీజేపీ వర్గాల మధ్య ఘర్షణ

చండూరు మున్సిపాలిటీలోని 4వ వార్డులో టీఆర్ఎస్ ,బీజేపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. టీఆర్ఎస్ కు చెందిన కరీంనగర్ జిల్లా నేతలు చండూరులోనే మకాం వేశారని స్థానికులు ఆరోపించారు.

Munugode bypoll 2022:   clashes between TRS and BJP At Chandur
Author
First Published Nov 3, 2022, 9:35 AM IST

చండూరు:పట్టణంలోని 4వ వార్డులో టీఆర్ఎస్,బీజేపీ వర్గాల మధ్య  గురువారంనాడు ఘర్షణ  వాతావరణం చోటు చేసుకుంది.చండూరు 4వ వార్డులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేతలు  చండూరులోని ఓ ఇంట్లో ఉన్నారు. ఈ విషయాన్ని గుర్తించిన బీజేపీ కార్యకర్తలు ఆ  ఇంటిపై  దాడి చేశారు. అయితే ఈ ఇంట్లో ఉన్న  ఏడుగురు ఆ ఇంట్లో నుండి తప్పించుకు వెళ్లారు. ఈ సమయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుందని స్థానికులు మీడియాకు చెప్పారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మొగిలిపాలెంకు చెందిన వారున్నారని బీజేపీ  నేతలు ఆరోపించారు.మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో స్థానికేతరులున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  అధికారులకు పిర్యాదు చేసినా కూడ   అధికారులు  పట్టించుకోలేదని బీజేపీ  నేతలు ఆరోపించారు.పోలీసులు టీఆర్ఎస్  కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ నేతలు  ఆరోపించారు.

also read:మునుగోడు బైపోల్ 2022: ఇడికుడలో ఓటేసిన కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి

ఈ ఏడాది ఆగస్టు 8వ తేదీన మునుగోడు ఎమ్మెల్యే పదవికి కాంగ్రెస్ కోమటిరెడ్డి రాజగోపాల్  రెడ్డి రాజీనామా  చేశారు. దీంతో ఈ స్థానానికి ఇవాళ ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే  పదవికి రాజీనామా  చేయడానికి నాలుగు రోజుల ముందే కోమటిరెడ్డి రాజగోపాల్  రెడ్డి కాంగ్రెస్  పార్టీకి  రాజీనామా  చేశారు.  అదే నెల 21న బీజేపీలో చేరారు. 2018లో కాంగ్రెస్ అభ్యర్ధిగా ఈ స్థానం నుండి  కోమటిరెడ్డి రాజగోపాల్   రెడ్డి విజయం  సాధించారు. ఈ దఫా  బీజేపీ అభ్యర్ధిగా బరిలో కి దిగారు. కాంగ్రెస్ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతి, టీఆర్ఎస్ అభ్యర్ధిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పోటీలో  ఉన్నారు. ఈ  నియోజకవర్గంలో 2,41855 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు  అధికారులు ఏర్పాట్లు చేశారు. మునుగోడు  ఉప ఎన్నికల్లో  47 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు.  47  మందిలో  ప్రధానంగా మూడు పార్టీల మధ్య పోటీ  నెలకొంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios