రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం ఒక్కొక్కరిదిగా తేలుతోంది. ఈనెల 22న రాష్ట్రవ్యాప్తంగా 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ శనివారం ఉదయం మొదలయింది. 

ఫలితాలపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ కనిపిస్తోంది. తమ తమ అంచనాల మేరకు ఫలితాలు వస్తాయా రావా అన్న దానిపై పార్టీలు ఆసక్తితో ఎదురుచూస్తున్నాయి. పోలింగ్‌ జరిగిన సరళిని బట్టి గతంలో జరిగిన అన్ని ఎన్నికల ఫలితాల తరహాలోనే పురపోరులోనూ టీఆర్‌ఎస్‌కు స్పష్టమైన ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తోంది. 

ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోని ధర్మపురిలో కాంగ్రెస్ తెరాస మధ్య హోరాహోరీ పోరు ససాగింది. చావుతప్పి కన్ను లొట్టపోయిందన్నట్టు ఒక్క వార్డు తేడాతో తెరాస మునిసిపాలిటీని కైవసం చేసుకుంది. 

ఉన్న 15 వార్డుల్లో కాంగ్రెస్ ఏడింటిని గెల్చుకోగా అధికార తెరాస 8 ఇంటిని గెలిచింది. ఒక్క వార్డు ఆధిక్యంలో మాత్రమే ఉంది. అయితే కొందరు అభ్యర్థులను తమవైపుకు తిప్పుకునేందుకు ఇటు కాంగ్రెస్, అటు తెరాస చూస్తున్నాయి. 

ఈ ఇరు పార్టీల గాలెం నేపథ్యంలో ఒక ఇద్దరు అభ్యర్థుల తమ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేయడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో ధర్మపురిలో తెరాస కు ఇది ఊహించని షాక్ అనే చెప్పవచ్చు. ధర్మపురినుంచి తెరాస మంత్రి కొప్పుల ఈశ్వర్ కు ఇది ఊహించని షాక్ గా చెప్పొచ్చు. 

మంత్రి ఈశ్వర్ గతంలో ఇక్కడి నుండి కేవలం 441 ఓట్ల తేడాతో మాత్రమే గెలుపొందారు. ఇక్కడున్న గ్రూపు రాజకీయాలు మంత్రి ఇలాకాలో కాంగ్రెస్ కు కలిసొచ్చిందని చెప్పవచ్చు.