Asianet News TeluguAsianet News Telugu

నేరేడుచర్లలో కేవీపీకి ఓటు: ఉత్తమ్ తో గొడవ, మైక్ విరగ్గొట్టిన ఎమ్మెల్యే సైదిరెడ్డి

నేరేడుచర్ల చైర్మన్ ఎన్నికలో ఓటు వేయడానికి కేవీపీ రామచందర్ రావు రావడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కేవీపీ ఎక్స్ అఫిషియో సభ్యుడిగా నమోదుకు దరఖాస్తు పెట్టుకున్నారు.  ఎమ్మెల్యే సైదిరెడ్డి గొడవలో మైక్ విరగ్గొట్టాడు. 

Municipal elections: MLA saidi Reddy tries to obstruct KVP
Author
Nereducharla, First Published Jan 27, 2020, 12:51 PM IST

హైదరాబాద్: తెలంగాణలోని మున్సిపాలిటీల చైర్మెన్, నగరపాలక సంస్థల మేయర్ ఎన్నికలు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీస్తున్నాయి. పలు చోట్ల కాంగ్రెసు, టీఆర్ఎస్ లకు మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. సోమవారంనాడు నగరపాలక సంస్థల మేయర్ పదవులకు, మున్సిపాలిటీల చైర్మెన్ పదవులకు ఎన్నికలు జచరుగుతున్న విషయం తెలిసిందే. 

నేరేడుచర్లలో ఎక్స్ అఫిషియో సభ్యుడిగా కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచందర్ రావు ఓటు వేయడానికి వచ్చారు. ఇక్కడ కాంగ్రెసు ఏడు, టీఆర్ఎస్ ఏడు వార్డులను గెలుచుకున్నాయి. మరో వార్డును కమ్యూనిస్టు పార్టీ గెలుచుకుంది. కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెసుకు మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తోంది.

నేరేడుచర్ల చైర్మన్ పదవిని కైవసం చేసుకోవడానికి కేవీపీ రామచందర్ రావు ఓటును కూడా వాడుకోవాలని నిర్ణయించుకుంది. దీంతో కేవీపీ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి వచ్చారు. కేవీపీని లోనికి అనుమతించడంపై టీఆర్ఎస్ స్థానిక శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. 

ఉత్తమ్ కుమార్ రెడ్డితో సైదిరెడ్డి వాగ్వివాదానికి దిగారు. సైదిరెడ్డి ఆగ్రహంతో మైక్ ను విరగ్గొట్టాడు. కేవీపీకి ఓటు హక్కు కల్పించడంపై టీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. చైర్మన్ ఎన్నికను వాయిదా వేయాలని కోరింది.

తీవ్ర గందరగోళం చోటు చేసుకోవడంతో ఎన్నికను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. రాష్ట్ర విభజన తర్వాత కేవీపీని తెలంగాణకు కేటాయించారు. టీఆర్ఎస్ ఎంపీ కె. కేశవరావు, కాంగ్రెసు ఎంపీ హనుమంతరావు ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 

నేరేడుచర్లలో టీఆర్ఎస్ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ బోడకంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఎక్స్ అఫిషియో సభ్యులుగా నమోదు చేసుకున్నారు. కాంగ్రెసు నుంచి ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఉన్నారు. కాంగ్రెసు ఎంపీ కేవీపీ రామచంద్రరావు కూడా ఎక్స్ అఫిషియో సభ్యుడిగా దరఖాస్తు చేసుకున్నారు అయితే, ఓటు హక్కు కల్పించలేదు. దీంతో కాంగ్రెసు ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. 

టీఆర్ఎస్ కు ముగ్గురు ఎక్స్ అఫిషియో సభ్యులతో కలిపి పది మంది బలం ఉండగా, 2 ఎక్స్ అఫిషియో సభ్యులతో కలిపి సీపీఐ మద్దతుతో కాంగ్రెసు బలం కూడా 10కి చేరింది. ఈ నేపథ్యంలో కేవీపీ ఓటు హక్కుపై టీఆర్ఎస్ తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios