Asianet News TeluguAsianet News Telugu

మెడికల్ క్యాంప్ నిర్వహించిన మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు

హైదరాబాద్ నగరంలో మల్లారెడ్డి కాలేజీ విద్యార్థులు ఓ మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ముగ్గురు వైద్యుల సహాయంతో నిర్వహించిన ఈ క్యాంప్‌ను 273 మంది పేషెంట్లు హాజరవ్వగా, వారందరికీ విజయవంతంగా హెల్త్ చెకప్ చేశారు. మెడిసిన్స్ అందజేశారు. 
 

MRIET students conducted medical camp in hyderabad
Author
Hyderabad, First Published Sep 21, 2021, 2:46 PM IST

హైదరాబాద్: మల్లారెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యార్థులు ప్రేమ్ నగర్ హఫీజ్‌పేట్‌ ఆరోగ్య కేంద్రంలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ముగ్గురు వైద్యుల సహాయంతో నిర్వహించిన ఈ క్యాంప్ విజయవంతమైంది. నగరంలో విద్యార్థులతో నడిచే అతిపెద్ద ఎన్‌జీవో స్ట్రీట్ కాస్. ఈ ఎన్‌జీవోలోనే మల్లారెడ్డి కాలేజీ విద్యార్థుల స్వచ్ఛంద కార్యక్రమాలకు ప్రత్యేక శాఖ ఏర్పడి ఈ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కీళ్లనొప్పులు, డయాబెటిస్, ఇతర చర్మ వ్యాధులకు సంబంధించిన రుగ్మతలకు వైద్యులు చికిత్సనందించారు. మెడిసిన్స్‌తోపాటు కీలక సూచనలు చేశారు. తద్వార భవిష్యత్‌లో తీవ్ర ఆరోగ్య సమస్యల నుంచి పేషెంట్లు ఉపశమనం పొందనున్నారు. 

ఈ క్యాంప్‌లో పేషెంట్లకు హోమియోపతి మెడిసిన్స్ కూడా అందించారు. మొత్తం 273 మంది పేషెంట్లు ఈ క్యాంప్‌నకు హాజరయ్యారు. వైద్యులు వారందరికీ విజయవంతంగా హెల్త్ చెకప్ చేశారు. డివిజనల్ ప్రెసిడెంట్ రేణుకా, నికితా, భవ్య, చాణక్య, సుశాంత్, వంశీ, విష్ణు, అనిత, గోపిచంద్, జానకీ రామ్, విజయ్ ఈ క్యాంప్ నిర్వహించారు.

Follow Us:
Download App:
  • android
  • ios