హైదరాబాద్: చర్లపల్లి జైలు నుండి  కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్కాజిగిరి  ఎంపీ రేవంత్ రెడ్డి  బుధవారం నాడు సాయంత్రం విడుదలయ్యారు. అయితే, పోలీసు వాహనంలోనే రేవంత్ రెడ్డిని జైలు నుంచి ఇంటికి తీసుకుని వెళ్లారు. కాంగ్రెసు పార్టీ కార్యాలయం గాంధీ భవన్ వద్ద తనను దించాలని రేవంత్ రెడ్డి వారికి చెప్పారు. రేవంత్ రెడ్డి ఇంటి వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

కేటీఆర్ లీజుకు తీసుకొన్న ఫామ్ హౌస్ పై అనుమతి లేకుండా డ్రోన్‌ను వినియోగించి పోటోలు తీసిన కేసులో రేవంత్ రెడ్డితో పాటు ఆయన అనుచరులపై ఈ నెల 5వ తేదీన కేసు నమోదైంది.  

 ఈ కేసులో రేవంత్ రెడ్డిని ఈ నెల 6వ తేదీన నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో రేవంత్ రెడ్డి చర్లపల్లి జైలులో ఉన్నారు. రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణ చేసింది.  ఈ కేసులో రేవంత్ రెడ్డికి షరతులతో హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

బెయిల్ మంజూరు కావడంతో  రేవంత్ రెడ్డి బుధవారం నాడు సాయంత్రం చర్లపల్లి జైలు నుండి విడుదలయ్యారు. మార్చి 11వ తేదీన కూకట్‌పల్లి కోర్టు రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.  

 అనుమతి లేకుండా డ్రోన్ కెమెరాను ఉపయోగించిన కేసులో ఏ-1 నిందితుడుగా ఉన్నాడు.   రేవంత్ రెడ్డి అనుచరులకు ఇప్పటికే బెయిల్ మంజూరైంది. కానీ,రేవంత్ రెడ్డికి మాత్రం కోర్టు బెయిల్ ఇవ్వలేదు.

Also read:రేవంత్ రెడ్డికి ఊరట: షరతులతో కూడిన బెయిల్ మంజూరు

రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్  ను ఈ నె 11వ తేదీన హైకోర్టు  కొట్టివేసింది.కేటీఆర్ లీజుకు తీసుకొన్న ఫామ్‌హౌస్‌పై అనుమతి లేకుండా డ్రోన్ కెమెరాను ఉపయోగించారని నార్సింగ్ పోలీసులు  కేసు నమోదు చేశారు. ఈ కేసులో  రేవంత్ రెడ్డిని ఈ నెల 5వ తేదీన నార్సింగ్ పోలీసులు అరెస్టు చేశారు.

రేవంత్ రెడ్డితో పాటు ప్రవీణ్, విజయసింహ, జైపాల్ రెడ్డి, శివ, ఓంప్రకాశ్ లను కూడా పోలీసులు అరెస్టు చేశారు. వీరికి రాజేంద్రనగర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఎట్టకేలకు బుధవారం నాడు రేవంత్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.