పోలీసులపై చర్యలు తీసుకోవాలని హైకోర్టులో రేవంత్ రెడ్డి పిటిషన్
చట్ట వ్యతిరేకంగా మంత్రి కేటీఆర్, ఇతర ప్రముఖుల ఇండ్లపై డ్రోన్లు ఎగరేశానని తనను అరెస్టు చేసిన పోలీసులపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి హైకోర్టులో రిట్‌పిటిషన్ దాఖలు చేశారు.
చట్ట వ్యతిరేకంగా మంత్రి కేటీఆర్, ఇతర ప్రముఖుల ఇండ్లపై డ్రోన్లు ఎగరేశానని తనను అరెస్టు చేసిన పోలీసులపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి హైకోర్టులో రిట్‌పిటిషన్ దాఖలు చేశారు.
తనపై తొలుత ఐపీసీ-188 కింద కేసు నమోదు చేసి తర్వాత దానిని ఐపీసీ-287, 109, 115, 201, 120(బి), ఎయిర్ క్రాఫ్ట్ యాక్టులోని సెక్షన్ 11(ఎ) రెడ్‌విత్ 5-ఏ కింద పెట్టారని ఆయన పేర్కొన్నారు.
తాను ఎలాంటి డ్రోన్ ఎగురవేయలేదని అన్న రేవంత్ రెడ్డి... ఏడేళ్ల లోపు శిక్ష పడే కేసుల్లో రిమాండ్‌కు తరలించకూడదని అర్వేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పోలీసులు పాటించలేదని ఆరోపించారు.
‘‘నేను ఎలాంటి డ్రోన్ కెమెరాలను ఎగరేయలేదని పోలీసులకు చెప్పా. నాపై మోపుతున్న అభియోగాలపై సీఆర్‌పీసీ-41ఏ కింద నోటీసులు ఇవ్వాలని కోరా. కానీ నేను చెప్పింది విన్పించుకోకుండా మాదాపూర్ ఏసీపీ శ్యాంప్రసాదరావు, నార్సింగి ఎస్‌హెచ్‌వో గంగాధర్ నన్ను అరెస్టు చేసి రాజేంద్రనగర్ కోర్టులో హాజరుపరిచారు. పోలీసుల చర్య ఆర్నేశ్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకం. నాపై మోపిన సెక్షన్లు ఒకవేళ రుజువైనా .. గరిష్ఠంగా 7 సంవత్సరాలకంటే తక్కువ శిక్షలు పడే అవకాశమే ఉంది. ఇలాంటి కేసుల్లో అరెస్టు చేసి రిమాండ్‌కు పంపరాదు. వారిపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోండి’’ అని రేవంత్ రెడ్డి తన రిట్ పిటిషన్ లో కోరారు.
ఇకపోతే... నిర్మాణాల్లో అతిక్రమణలకు సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సదరన్ శాఖ కేటీఆర్ కి నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ నేత, మల్కాజ్ గిరి ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా, జీవో 111 కింద ఉన్న ఆస్తులపై పరిశీలన జరపడానికి హై లెవెల్ కమిటీని కూడా నియమించాలని ఆదేశించింది.
జీవో 111 ను అతిక్రమించి స్విమ్మింగ్ పూల్, ఇతర సదుపాయాలతో కేటీఆర్ జన్వాడ ప్రాంతంలో ఫార్మ్ హౌస్ నిర్మించారని, అందునా ఉస్మాన్ సాగర్ లోకి వర్షపునీరు చేరే సహజసిద్ధమైన నాలాను ఆక్రమించి రక్షిత స్థలంలో ఈ నిర్మాణం చేప్పటారని ఆయన ఆరోపించారు.
కేటీఆర్ దీన్ని ఖండించారు. ఆ ఫార్మ్ హౌస్ తనది కాదని అన్నారు. ఆయన ట్విట్టర్ వేదికగా ఇది ఉద్దేశపూర్వక కక్ష సాధింపు చర్య అని అన్నారు. హై కోర్టులో కేటీఆర్ కు ఈ కేసుకు లభించింది.