తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై, తెరాస ప్రభుత్వంపై రోజురోజుకి విమర్శలు ఎక్కువయిపోతున్నాయి. కరోనా వైరస్ పరిస్థితిని హ్యాండిల్ చేయడంలో సర్కారు విఫలమైందని విపక్షాలు గొంతెత్తి ఆరోపిస్తున్నాయి. 

ఇక ఈ కరోనా రక్కసి కోరలు చాస్తుండగానే.... తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న సచివాలయ కూల్చివేత నిర్ణయం మరిన్ని విమర్శలకు దారితీసింది. ఇక  ఆతరువాత ఉస్మానియా ఆసుపత్రిలోకి వరద నీరు చేరుకోవడం, రోగులు అగచాట్లు పాడడం, పథ బిల్డింగ్ కి తాళం వేయడం అన్ని వెరసి కేసీఆర్ మీద తీవ్రమైన విమర్శలు కురిపిస్తున్నారు. 

సామాన్య ప్రజల్లో కూడా తెరాస ప్రభుత్వం ఈ కరోనా కట్టడిలో వెనుక బడుతుందన్న అభిప్రాయం కలుగుతుంది. ముఖ్యంగా పక్కనున్న ఆంధ్రప్రదేశ్ లో కేసులు పెరుగుతున్న అక్కడ పరిస్థితి నయంగా ఉందని అనుకునే పరిస్థితి. కోర్టు సైతం తెలంగాణ సర్కారును తీవ్రంగా తప్పుబట్టిన విషయం తెలిసిందే. 

మీడియాలో తెలంగాణ సర్కారు కరోనా హ్యాండ్లింగ్ కు సంబంధించిన కథనాలు విపరీతంగా రావడంతో తన మార్కు అస్త్రం తెలంగాణ సెంటిమెంటును తెరాస బయటకు తీసింది. ఆంధ్ర వలస పాలన నుంచి మొదలుపెట్టు ఆంధ్ర వాదుల రాక్షసానందం అంటూ రకరకాల వ్యాఖ్యలు తెరాస అనుకూల మీడియాలో పత్రికల్లో ప్రచురితమైంది. 

దీనిపై కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి కేసీఆర్ కి సవాల్ విసిరారు. నిజంగానే కేసీఆర్ గనుక ఆంధ్రా ఆనవాళ్లను చెరిపేయాలనుకుంటే.... తొలుత తన కుమారుడు కేటీఆర్ పేరును మార్చాలని ఛాలెంజ్ చేసారు. 

ఇక రేవంత్ రెడ్డి ఛాలెంజ్ తో సోషల్ మీడియా అంతా ఇదే హోరు నడుస్తుంది. కేటీఆర్ తెలంగాణ సెంటిమెంటును బలంగా పండించాలంటే పేరు మార్చాల్సిందేనని, పేరు మార్చాలంటే నోటిఫికేషన్ ఇస్తే సరిపోతుందని, అది పెద్ద విషయం కాదని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు.