Asianet News TeluguAsianet News Telugu

చిక్కుల్లో మల్కాజ్ గిరి ఎంపీ మల్లారెడ్డి

నిత్యం వార్తల్లో ఉండే మల్కాజ్ గిరి ఎంపీ మల్లారెడ్డి చిక్కుల్లో పడ్డారు. ఎంపీ మల్లారెడ్డిపై సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. మల్లారెడ్డి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ల్లో 150 మెడికల్ సీట్ల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని పిటీషన్ లో పేర్కొంది. 150 సీట్ల కేటాయింపుల్లో ఫోర్జరీ చేశారంటూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు అయ్యింది. 

MP Malla Reddy in trouble with petition filed in the court
Author
Hyderabad, First Published Sep 27, 2018, 6:39 PM IST

హైదరాబాద్: నిత్యం వార్తల్లో ఉండే మల్కాజ్ గిరి ఎంపీ మల్లారెడ్డి చిక్కుల్లో పడ్డారు. ఎంపీ మల్లారెడ్డిపై సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. మల్లారెడ్డి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ల్లో 150 మెడికల్ సీట్ల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని పిటీషన్ లో పేర్కొంది. 150 సీట్ల కేటాయింపుల్లో ఫోర్జరీ చేశారంటూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు అయ్యింది. 

వివరాల్లోకి వెళ్తే కేంద్ర ఆరోగ్య శాఖ అనాలోచిత నిర్ణయం వల్ల తెలంగాణ విద్యార్థులు 75 మెడిసిన్‌ సీట్లు కోల్పోవాల్సి వచ్చిందని మల్లారెడ్డి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ యాజమాన్యం ఆరోపిస్తోంది. తొలుత మెడికల్ కళాశాల నిబంధనలు ఉల్లంఘించిందంటూ రెండేళ్లు అడ్మిషన్లు నిలిపివేసిన కేంద్ర ఆరోగ్యశాఖ ఆ తర్వాత వాటిని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అప్పటికీ ఎంబీబీఎస్ సీట్ల తుది కౌన్సిలింగ్ గడువు ముగియడంతో విద్యార్థులు నష్టపోయారు. 

మల్లారెడ్డి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌కు 2017–18 విద్యాసంవత్సరంలో 150 సీట్లతో ఎంబీబీఎస్‌ కోర్సు నిర్వహణకు కేంద్ర ఆరోగ్య శాఖ రెన్యువల్‌ జారీ చేసింది. అయితే భారత వైద్య మండలి (ఎంసీఐ) గతేడాది డిసెంబర్‌ 6, 7న ఆ కళాశాలలో ఆకస్మిక తనిఖీ చేసి ఓ అధ్యాపకుడు, ఇద్దరు రెసిడెంట్‌ డాక్టర్ల సంతకాలు సరిపోలలేదని తేల్చింది.

సంతకాలు సరిపోలేదన్న విషయాన్ని ఎథిక్స్‌ కమిటీకి ఎంసీఐ బృందం నివేదించింది. సదరు కమిటీ ఈ వ్యవహారాన్ని పరిష్కరించకముందే వైద్య కళాశాల స్థాపన నిబంధనల్లోని 8(3)(1)(డీ)ని అమలు చేస్తూ 2018–19, 2019–20 ల్లో కళాశాల అడ్మిషన్లు జరపకుండా నిషేధించాలని కేంద్రానికి ఎంసీఐ కార్యనిర్వాహక కమిటీ సిఫారసు చేసింది. కేంద్రం 2018 మే 31న అడ్మిషన్లు తీసుకోకుండా నియంత్రిస్తూ ఉత్తర్వులిచ్చింది.  

తాజాగా ఇదే అంశంపై ఎంపీ మల్లారెడ్డిపై సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios