తెలంగాణకు కొత్త సచివాలయం అవసరమా అంటూ.. ఓ నెటిజన్ చేసిన ట్వీట్ కి నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఘాటుగా స్పందించారు. అసలు మీరు ఎప్పుడైనా పాత సచివాలయాన్నిచూశారా అంటూ.. మండిపడ్డారు.

ఇంతకీ మ్యాటరేంటంటే... బైసన్ పోలో మైదానాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాల్సిందిగా కోరుతూ టీఆర్ఎస్ ఎంపీలు శుక్రవారం కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతీరామన్ ని కలిసి విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. కాగా.. ఈ ఘటనపై ఓ నెటిజన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

రియల్ కేసీఆర్ పేరిట ఎకౌంట్ కలిగిన నెటిజన్.. తెలంగాణకు అసలు కొత్త సచివాలయం ఎందుకని ప్రశ్నించారు. కేసీఆర్, అతని కుటుంబసభ్యుల మూఢనమ్మకాలు, తెలివి తక్కువ పనులను అడ్డుకుందామంటూ.. ట్వీట్ చేశారు.

కాగా.. ఈ ట్వీట్ కి కవిత ఘాటుగా స్పందించారు. ‘‘డియర్ ఫేక్ ఎకౌంట్... పేరు చెప్పుకోవడానికి  కూడా భయపడుతున్నారు. రియల్ కేసీఆర్ పేరు వెనుక దాక్కుంటున్నారు. పాత సచివాలయాన్ని ఎప్పుడైనా చూశారా? క్షేత్రస్థాయిలో వాస్తవాలు గ్రహించకుండా మాట్లాడటం సరికాదన్నారు.