వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు సీఎం కేసీఆర్ ఎంతగానో శ్రమిస్తున్నారన్నారు సీఎం కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కవిత. ఇవాళ జగిత్యాల జిల్లా పొలాసలో వ్యవసాయ వర్సిటీ శాస్త్రవేత్తలు వరినాట్లు వేసే యంత్రాల పనితీరును ప్రదర్శనకు ఉంచారు.
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు సీఎం కేసీఆర్ ఎంతగానో శ్రమిస్తున్నారన్నారు సీఎం కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కవిత. ఇవాళ జగిత్యాల జిల్లా పొలాసలో వ్యవసాయ వర్సిటీ శాస్త్రవేత్తలు వరినాట్లు వేసే యంత్రాల పనితీరును ప్రదర్శనకు ఉంచారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలిసి కవిత హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి పోచారం వరినాట్లు వేసే యంత్రాన్ని నడిపి పనితీరును తెలుసుకున్నారు. అనంతరం కవిత మాట్లాడుతూ... ప్రస్తుతం వ్యవసాయానికి కూలీలు దొరకడం లేదని.. కూలీల ఖర్చు రైతులకు భారంగా మారిందన్నారు. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్, రాజేంద్రనగర్‌లోని జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలతో కలిసి ప్రత్యామ్నాయం అన్వేషించారన్నారు..

దీనిలో భాగంగానే పాలిథీన్ షీట్‌లపై వరినాడు పెంచి నాట్లు వేసే విధానానికి రూపకల్పన చేశారన్నారు.. తెలంగాణ ఆవిర్భవించిన తరువాత 12వ స్థానంలో ఉన్న వ్యవసాయం విశ్వవిద్యాలయం 6వ స్థానంలో నిలిచిందన్నారు.


