జగిత్యాల: ప్రజాకూటమిపై టీఆర్ఎస్ ఎంపీ కవిత ధ్వజమెత్తారు. నాలుగన్నరేళ్ల పాలనలో ట్రైలర్ మాత్రమే చూపించామని ఇంకా సినిమా చూపించలేదని చెప్పారు. ట్రైలర్ కే ఇంతలా భయపడిపోతే ఎలా అని ప్రశ్నించారు. ట్రైలర్ కే భయపడి అన్ని పార్టీలు కలిసి అన్ని జెండాలు ఒకే చోటపెట్టి టీఆర్ఎస్ పై యుద్ధానికి రాబోతున్నాయని స్పష్టం చేశారు.

ట్రైలర్ కే ఇలా భయపడితే ఇక సినిమా చూపిస్తే ఉంటారా అని నిలదీశారు. రాబోయే రోజుల్లో ప్రజాకూటమికి త్రీడీ స్క్రీన్ పై మంచి సినిమా చూపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాలలో పర్యటించిన కవిత కాంగ్రెస్‌, టీడీపీలపై విరుచుకుపడ్డారు. 

కాంగ్రెస్ కు కమిట్‌మెంట్ లేదని, టీడీపీకి సెంటిమెంట్ లేదని విమర్శించారు. ప్రజలు ప్రజాకూటమికి కర్రు కాల్చి వాత పెట్టాలని కవిత పిలుపునిచ్చారు. నాలుగేళ్లలో అభివృద్ధికి సంబంధించి ఒక నమూన మాత్రమే తెలంగాణ ప్రజలకు ఇచ్చామని, రాబోయే రోజుల్లో బంగారు తెలంగాణ నిర్మాణం జరుగుతుందని కవిత ఆశాభావం వ్యక్తం చేశారు.