మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తెలంగాణ ఎన్నికలపై చేసిన సర్వే అంతా వట్టి బోగస్ అని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. లగడపాటి సర్వే వెనుక చంద్రబాబు హస్తం ఉందని గుత్తా ఆరోపించారు. ప్రస్తుతం తెలంగాణలో లగడపాటి రాజగోపాల్ చేసిన సర్వే కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. కేటీఆర్, లగడపాటి ల మధ్య మాటల యుద్ధం కూడా జరుగుతోంది.

కాగా.. ఈ విషయంపై గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందించారు.  ఓటమి భయంతోనే కూటమి నేతలు బోగస్ సర్వేలు తెరపైకి తెస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు చంద్రబాబుకి తొత్తులుగా మారారని మండిపడ్డారు. తెలంగాణను చంద్రబాబుకి తాకట్టు పెట్టాలనే దుర్మార్గపు ఆలోచన కాంగ్రెస్ కి ఉందన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా.. ఈ ఎన్నికల్లో గెలిచేది టీఆర్ఎస్ అని తేల్చిచెప్పారు.  ఉమ్మడి నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్ కి మద్దతుగా అనూహ్య ఫలితాలు వస్తాయని చెప్పారు.