సైబరాబాద్ సీపీ సజ్జనార్ తో... ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్ వార్ కి దిగారు. ఇప్పుడు ట్విట్టర్ వేదికగా వీరిద్దరి మధ్య జరిగుతున్న మాటల యుద్ధం సంచలనంగా మారింది. దిశ నిందితుల ఎన్ కౌంటర్ విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ... కౌంటర్లు వేయడం గమనార్హం.

ఇంతకీ మ్యాటరేంటంటే... అమెరికన్ కంపెనీల్లో ఎవరైనా జీహాదీలు పనిచేస్తున్నారా అంటూ సురేశ్ కొచ్చెటి  అనే  ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. కాగా... ఆ నెటిజన్ ట్వీట్ కి సైబరాబాద్ సీపీ సజ్జనార్ స్పందించారు. ఉగ్రవాద సమాచారం సేకరించేందుకు తమ వద్ద వ్యవస్థ ఉందని చెప్పారు. కాగా... సజ్జనార్ ట్వీట్ పై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు.

సైబరాబాద్ లో ఎంతమంది జీహాదీలు ఉన్నారు అంటూ సజ్జనార్ ని ఉద్దేశించి ట్వీట్ చేశారు. సైబరాబాద్ లో ఎంతమంది జీహాలు ఉన్నారో సమాచారం మీ వద్ద ఉందా..? వాళ్లు ఏ కంపెనీలో జీహాదీలుగా పనిచేస్తున్నారు..? సమాచారం మీరిస్తారా? ఎంపీగా నేను స్పందించాలా అంటూ ఓవైసీ అంటూ ట్వీట్ చేశారు.

భక్తుడి మాదిరిగా సమాధానం ఇస్తున్నారంటూ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దిశ నిందితుల ఎన్ కౌంటర్ విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఓవైసీ లేవనెత్తారు. ఎన్ కౌంటర్ చేయడాన్ని తప్పుపడుతూ మరో ట్వీట్ చేశారు. ఉదయం 5గంటలకు ఎన్ కౌంటర్లు చేయడం కాదంటూ మరో ట్వీట్ లో పేర్కొన్నారు. అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ ద్వారా కూడా ఒప్పుకోవచ్చు అని... ఎన్ కౌంటర్లు చేయడం దారుణమని పేర్కొన్నారు.