భారతరత్న అవార్డుపై ఎంపీ, మజ్లిస్ పార్టీ నేత అసదుద్దీన్ ఓవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీఆర్ అంబేద్కర్ కి భారతరత్న అవార్డును బలవంతంగా ఇచ్చారంటూ సంచలన కామెంట్స్ చేశారు. అంబేద్కర్ కి భారత రత్నను హృదయపూర్వకంగా ఇవ్వలేని కేవలం బలవంతంగానే ఇచ్చారని పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం దేశంలోనే అత్యున్నత పురస్కారమైన భారతరత్నను మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రముఖ గాయకుడు భూపేన్ హజారికా, సామాజిక వేత్త నానాజీ దేశ్ ముఖ్ కు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అసదుద్దీన్ పైవిధంగా వ్యాఖ్యానించారు.

మహారాష్ట్రలోని కళ్యాణ్ నగరంలో వంచిత్ బహుజన్ సభలో పాల్గొని ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు ఎంతమంది దళితులు, ఆదివాసులు, ముస్లింలు, పేదలు, అగ్రవర్ణాలైన బ్రహ్మణులకు అవార్డులు ఇచ్చారని అసదుద్దీన్ ఈ సందర్భంగా ప్రశ్నించారు.