కోదాడలో తృుటిలో పెను ప్రమాదం తప్పింది. రహదారిపై వెళుతున్న కారులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. కోదాడ నుంచి హుజూర్‌నగర్ వైపు వెళుతున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

దీనిని పసిగట్టిన డ్రైవర్ వెంటనే గమనించి కారులో ఉన్న వారిని అప్రమత్తం చేసి, అందరిని కిందకి దించేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో కారు పూర్తిగా దగ్థమైపోయింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.