Asianet News TeluguAsianet News Telugu

కానిస్టేబుల్‌వి నన్నే ఆపుతావా: నడిరోడ్డుపై వాహనదారుడు వీరంగం

రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో వాహనదారుడు రెచ్చిపోయాడు. హెల్మెట్ లేకుండా వాహనం నడుపుతున్న టూ వీలర్ యజమానిని చేవెళ్ల ట్రాఫిక్ పోలీసులు అడ్డగించారు. అయితే నన్నే అడ్డగిస్తారా అంటూ పోలీసులపై వాహనదారుడు విరుచుకుపడ్డాడు. 

motorcyclists overaction in chevella ksp
Author
Chevella, First Published Apr 11, 2021, 3:18 PM IST

రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో వాహనదారుడు రెచ్చిపోయాడు. హెల్మెట్ లేకుండా వాహనం నడుపుతున్న టూ వీలర్ యజమానిని చేవెళ్ల ట్రాఫిక్ పోలీసులు అడ్డగించారు. అయితే నన్నే అడ్డగిస్తారా అంటూ పోలీసులపై వాహనదారుడు విరుచుకుపడ్డాడు.

కానిస్టేబుల్ స్థాయిలో ఉన్న నువ్వు.. నా బండిని అడ్డుకుంటావా అంటూ వీరంగం సృష్టించాడు. ఇందుకు నీకు ఏ అధికారం ఉందంటూ నిలదీసినట్టు సమాచారం. బల ప్రయోగం చేసి తనను అడ్డుకోవడంతో పాటు విలువైన సమయాన్ని వృధా చేస్తారా అంటూ పోలీసులపై ఆ వ్యక్తి భగ్గుమన్నాడు.

అతను చన్ వల్లి గ్రామానికి చెందిన సుధాకర్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు.  వాహనదారుని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే అప్పటికే గంట పాటు ప్రధాన రహదారిపై సుధాకర్ రెడ్డి నానా హంగామా సృష్టించాడు. మెజిస్ట్రేట్ ముందుకు వస్తానని.. తాను చేసిన తప్పెంటో చెప్పి నన్ను ఉరి తీయాలంటూ పోలీసులపై వాగ్వాదానికి దిగాడు.

Follow Us:
Download App:
  • android
  • ios