14 రోజుల పసికందు అన్న కనికరం లేకుండా భవనం పై నుంచి కిందకు విసిరేసింది ఓ తల్లీ. దీంతో పసిబిడ్డ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఫతేనగర్ డివిజన్ నేతాజినగర్‌లో జరిగింది.

కుత్బుల్లాపూర్‌కు చెందిన వేణుగోపాల్‌కు నేతాజినగర్‌కు చెందిన లావణ్యతో 2016లో వివాహం జరిగింది. వీరికి ఓ బాబు జన్మించాడు. ఆ తర్వాత ఈ దంపతులు మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి.

ఈ తరుణంలోనే లావణ్య మరోసారి గర్భం దాల్చింది. ప్రసవం కోసం నేతాజినగర్‌లోని పుట్టింటికి వచ్చింది లావణ్య. అక్కడ కూడా మళ్లీ కుటుంబంలో గొడవలు రావడంతో ఈ నెల 29న ఎలుకల మందు తిని అస్వస్థతకు గురైంది.

ఆసుపత్రికి తరలించి చికిత్స అందించే తరుణంలో లావణ్య మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత పుట్టింటికి వచ్చిన లావణ్య.. భర్తపై వున్న కోపంతో నిన్న 14 రోజుల పసిబిడ్డను తాము నివసిస్తున్న భవనంపై నుంచి కిందకు విసిరేసింది.