ఓరుగంటి రమాదేవి మెమోరియల్ సర్వీస్ అవార్డును అందుకున్న వడ్లమూడి అరుంధతి (వీడియో)

https://static.asianetnews.com/images/authors/3800b66b-dc46-549b-a35e-91a1dbfb7895.jpg
First Published 27, Aug 2018, 3:18 PM IST
mother teresa award
Highlights

విద్యా రంగంలో చేసిన విశేష కృషికి గాను వడ్లమూడి అరుంధతి గారికి ఓరుగంటి రమాదేవి మెమోరియల్ సర్వీస్ అవార్డు లభించింది. మధర్ థెరిస్సా పుట్టినరోజు సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఈమెకు ఈ అవార్డును అందించారు.

విద్యా రంగంలో చేసిన విశేష కృషికి గాను తెలుగు అకాడమీ రీసెర్చ్ స్కాలర్ వడ్లమూడి అరుంధతి గారికి ఓరుగంటి రమాదేవి మెమోరియల్ సర్వీస్ అవార్డు లభించింది. మధర్ థెరిస్సా  జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఈమెకు ఈ అవార్డును అందించారు.

తన భార్య పేరు మీద ఈ అవార్డును ఓఎస్ శర్మ స్థాపించారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించే వారికి ప్రతి సంవత్సరం ఈ అవార్డును అందిస్తారు. అయితే 2018 కి గాను వడ్లమూడి అరుంధతి ఈ అవార్డుకు ఎంపికయ్యారు. 

పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఈ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యతో పాటు పలువురు రాజకీయ ప్రయుఖులు, విద్యావేత్తలు హాజరయ్యారు.
 

వీడియో

"

loader