Asianet News TeluguAsianet News Telugu

విషాదం : తొమ్మిదినెలల చిన్నారిని నడుముకు కట్టుకుని బావిలో దూకిన తల్లి... !!

కుటుంబ కలహాల నేపథ్యంలో మనస్థాపానికి గురైన సరిత తన 9 నెలల చిన్నారితో కలిసి రెండు రోజుల కిందట ఇంటి నుంచి వెళ్లిపోయింది. తల్లి, బిడ్డ కోసం కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టినా ఫలితం లేకపోయింది. దీంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా..అదృశ్యం కేసు నమోదు చేసిన పోలీసులు.. వారి కోసం గాలింపు చేపట్టారు.

mother suicide along with her 9 months old baby in mahabubnagar
Author
Hyderabad, First Published Dec 2, 2021, 1:26 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

మహబూబ్ నగర్ : తొమ్మిది నెలల చిన్నారితో కలిసి married woman బలవన్మరణం పాల్పడింది. ఈ ఘటన Mahabubnagar జిల్లా మిడ్జిల్ మండలం కేంద్రంలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే తిమ్మాజీపేట మండలం గుమ్మకొండ గ్రామానికి చెందిన సరిత (20)కి మిడ్జిల్ గ్రామానికి చెందిన శ్రీశైలంతో రెండేళ్ళ కిందట వివాహమయ్యింది.

వీరికి 9 నెలల చిన్నారి ఉంది. కుటుంబ కలహాల నేపథ్యంలో సరిత మనస్థాపానికి గురై చిన్నారితో కలిసి రెండు రోజుల కిందట ఇంటి నుంచి వెళ్లిపోయింది. తల్లి, బిడ్డ కోసం కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టినా ఫలితం లేకపోయింది. దీంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. missing కేసు నమోదు చేసిన పోలీసులు.. వారి కోసం గాలింపు చేపట్టారు.

ఈ క్రమంలో గురువారం ఉదయం గ్రామ శివారులోని నీటి కుంటలో తల్లి, కుమార్తె dead bodyలను స్థానికులు గుర్తించి కుటుంబసభ్యులు, పోలీసులకు సమాచారం అందించారు.  చిన్నారిని సరిత తన నడుముకు కట్టుకుని suicideకు పాల్పడింది. 

ఈ దృశ్యం అక్కడి వారిని కలిచివేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీసి... పోస్టుమార్టం నిమిత్తం జడ్చెర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ ఐ  జయ ప్రసాద్ తెలిపారు.  కాగా కుటుంబ సభ్యుల వేధింపులు తట్టుకోలేకే  సరిత  బలవన్మరణానికి పాల్పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఫ్యాషన్ డిజైనర్ గదిలోనుంచి దుర్వాసన.. తలుపులు పగలగొట్టి చూస్తే...

ఇదిలా ఉండగా, కరీంనగర్ లో ఓ మామ కోడలిని Extramarital affair పెట్టుకుందని నిత్యం ప్రచారం చేయడం మొదలు పెట్టాడు. అది సరికాదని Daughter-in-law ఎన్నిసార్లు చెప్పినా మానలేదు. దీంతో కోడలు విసుగు చెందింది. దీనికి పరిష్కారం మామ చనిపోవడమే అని నిర్ణయించుకుంది. తన అక్క కొడుకుతో కలిసి మామను అంతమొందించింది. 

గత నెల 27న కాచాపూర్ లో మాతంగి కనకయ్య (70) హత్యకు గురయ్యాడు. అయితే చంపింది కోడలేనని హుజూరాబాద్ ఏసీపీ వెంకట్ రెడ్డి తాజాగా తెలిపారు. కేశవపట్నం పోలీస్ స్టేషన్ లో మంగళవారం murder caseకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కనకయ్య భార్య, కుమారుడు గతంలోనే మృతి చెందారు. 

అయితే కనకయ్యకు వయసు మీద పడిందే కానీ.. అనుమానం పిశాచం వదలలేదు. నిత్యం మద్యం సేవించేవాడు. ఆ తరువాత కోడలు కొంరమ్మకు మరో వ్యక్తితో Illegal relationship ఉందని అనుమానించేవాడు. అంతేకాదు తనకు తిండి పెట్టడం లేదని తిడుతూ శాపనార్థాలు పెట్టేవాడు. ఇదే విషయంలో ఈ నెల 27న రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. పదే పదే ఇలాగే వేధిస్తుండడంతో కొంరమ్మ విసుగు చెందింది. 

ముసలోడు బతికి ఉంటే ఎప్పుడూ ఇలాగే తనను Suspicionతో వేధిస్తాడని, ఆస్తి కూడా తనకు దక్కదని భావించింది. తన అక్క కొడుకు, మానకొండూర్ మండలం కల్లెడకు చెందిన ప్రవీణ్ లో కలిసి కనకయ్యను చంపేందుకు ప్లాన్ వేసింది. ఈ ప్లాన్ ప్రకారం రోజూలాగే తాగి వచ్చి కోడలితో గొడవపడి.. నిద్రిస్తున్న కనకయ్యను కర్రతో విచక్షణారహితంగా కొట్టి, గొంతుకు తాడు బిగించి, బలంగా లాగడంతో మృతి చెందాడు. 

అయితే కనకయ్య కూతురు ఫిర్యాదు మేరకు కొంరమ్మ, ప్రవీణ్ లపై హుజూరాబాద్ రూరల్ సీఐ కిరణ్, ఎస్సై ప్రశాంత్ రావులు కేసు నమోదు చేశారు. నిందితులను విచారించగా హత్య చేసినట్లు ఒప్పుకున్నారని తెలిపారు. దీంతో వారిని రిమాండ్ కు తరలించినట్లు పేర్కొన్నారు. హత్య కేసును ఛేదించిన సీఐ, ఎస్సైలను ఏసీపీ అభినందించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios