జోగులాంబ గద్వాల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సెల్‌ఫోన్ కొనివ్వలేదనే కోపంతో కన్నతల్లిని ఓ వ్యక్తి రోకలి బండతో మోది దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన స్థానికంగా సంచలన సృష్టించింది.
నవమోసాలు మోసి, పెంచి పెద్ద చేసిన కన్నతల్లి పట్ల ఇటీవలీ కాలంలో దారుణాలు జరుగుతున్నాయి. తనకు భారంగా వుందని వదిలివేయడం, ఆస్తి కోసం హత్య చేయడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా సెల్ ఫోన్ (cell phone) కొనివ్వాలంటూ ఓ యువకుడు తన తల్లిని రోకలి బండతో మోదీ దారుణంగా హత్య చేశాడు. వివరాల్లోకి వెళితే.. తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా (jogulamba gadwal district) ఉండవల్లి(Undavalli) మండలంలోని శేరిపల్లి గ్రామానికి చెందిన లక్ష్మి, వెంకటేశ్వర్లు దంపతులకు ఇద్దరు కుమారులు.
లక్ష్మి వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది. పెద్ద కుమారుడు మహేశ్ ఇంటర్ పూర్తి చేశాడు. అప్పుడప్పుడు తల్లిదండ్రులతో కలిసి కూలి పనులకు వెళ్తుండేవాడు. ఈ నేపథ్యంలో తనకు స్మార్ట్‌ఫోన్ కొనివ్వాలని తల్లిని కోరాడు. డబ్బులు లేవని, తర్వాత కొనిస్తానని తల్లి చెప్పింది. అయినా మహేశ్ మారలేదు.. స్మార్ట్ ఫోన్ కొని తీరాల్సిందేనని పట్టుబట్టాడు. ఈ విషయంపై తల్లీ కుమారుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం మరోసారి తల్లితో ఫోన్ గురించి గొడవపడ్డాడు. ఆగ్రహంతో ఊగిపోతూ రోకలిబండతో తల్లి తలపై కొట్టాడు. ఆమె తీవ్రగాయాలపాలై కుప్పకూలిపోయింది.
లక్ష్మీ అరుపులు, కేకలతో స్థానికులు పరుగు పరుగున వచ్చి.. 108కు ఫోన్ చేశారు. అయితే అంబులెన్స్ వచ్చేటప్పటికే ఆమె మృతి చెందింది. మృతురాలి బంధువుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాగా.. ఇటీవలే లక్ష్మి మరో కుమారుడు సాల్మన్ .. కారు అద్దాలు పగులగొట్టి ఇద్దరిని గాయపరిచాడు. ఈ ఘటనలో అతను జైలుకూ వెళ్లాడు. తమ్ముడిని జైలుకు పంపించిన వారిపై మహేశ్ కక్ష పెంచుకున్నాడు. మూడు రోజుల క్రితం సదరు రైతులకు చెందిన పొలాల్లో మిరప కట్టెకు నిప్పు పెట్టాడు. ఆ సమయంలో అందులోకి దూకడంతో చేతులకు గాయాలయ్యాయి. కుమారుడిని చూసుకునేందుకు లక్ష్మి కూలి పనులకు వెళ్లకుండా ఇంటి వద్ద ఉంటోంది. ఇదే సమయంలో సెల్ ఫోన్ విషయంలో ఘర్షణ జరిగి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు.
ఇకపోతే.. తెలంగాణ రాష్ట్రంలోనే two-wheeler కొనుగోలు చేసేందుకు Ear piercings ఇవ్వలేదనే కోపంతో ఒక కొడుకు తన తల్లి గొంతు నులిమి murder చేశాడు. ఈ సంఘటన medak జిల్లా నిజాంపేట మండలంలోని నార్లపూర్ గ్రామంలో జరిగింది. నిజాంపేట ఏఎస్ఐ ప్రతాప్ తెలిపిన వివరాల ప్రకారం.. నిజాంపేట మండలం నార్లాపూర్ గ్రామానికి చెందిన మిరుదొడ్డి పోచమ్మ (76) కు ఇద్దరు కుమారులు చిన్న కుమారుడు కుమార్ గ్రామంలో జులాయిగా తిరుగుతున్నాడు. సోమవారం రాత్రి పోచమ్మ చిన్న కుమారుడు తనకు ద్విచక్రవాహనం కావాలని అందుకు చెవి కమ్మలు ఇవ్వమని తల్లితో వాగ్వాదానికి దిగాడు.
తల్లి చెవి కమ్మలు ఇవ్వడానికి నిరాకరించడంతో కుమార్ ఆవేశంతో తల్లి పోచమ్మ గొంతు నులిమి హత్య చేశాడు. ఇది చూసిన పెద్ద కుమారుడు పోలీసులకు సమాచారం అందించాడు.మృతురాలి పెద్దకుమారుడు నరసింహులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ వెల్లడించారు. తూప్రాన్ సిఐ శ్రీధర్, రామయంపేట్ ఎస్సై రాజేష్, పోలీసులు క్లూస్ టీం ఘటనా స్థలాన్ని పరిశీలించి, ఆధారాలు సేకరించారు. ఆ తరువాత మృతదేహానికి పంచనామా నిర్వహించి కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ప్రభుత్వాసుపత్రికి మృతదేహాన్ని తరలించినట్లు చెప్పారు.