తెలంగాణ- కర్ణాటక పోలీసులు నిర్వహించిన జాయింట్ ఆపరేషన్‌లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ భాకర్ అలీ అరెస్ట్ అయ్యాడు. ఖాకీ సినిమా తరహాలో 45 రోజుల పాటు కరీంనగర్ పోలీసులు వెంట పడీ, శోధించి మరీ అతనిని పట్టుకున్నారు.

అలీపై ఇప్పటి వరకు 118 కేసులు, తెలంగాణ, ఏపీ, కర్ణాటకల్లో పీడీ యాక్ట్‌లు కూడా ఉన్నాయి. 2015 ముందే హైదరాబాద్‌లో వందకి పైగా చైన్ స్నాచింగ్స్ చేశాడు. ఈ క్రమంలో కరీంనగర్‌లోని ఓ దొంగతనం కేసులో బాకర్ అలీ సినీఫక్కిలో దొరికాడు.

బీదర్‌కి చెందిన బాకర్ అలీని పట్టుకునేందుకు 200 మంది పోలీస్ సిబ్బంది.. వందల కొద్దీ సీసీ కెమెరాల ఫుటేజ్‌లను పరిశీలించారు. ఈ నేపథ్యంలో బీదర్‌లో అలీ ఉన్నాడని తెలుసుకుని అక్కడికి వెళ్లి పట్టుకున్నారు కరీంనగర్ పోలీస్‌లు.

నవంబర్ నుండి తెలంగాణలో 19 చైన్ స్నాచింగ్ లు, డిసెంబర్ 8 వ తేదీన ఏపీలోని కృష్ణా జిల్లాలో 5 చైన్ స్నాచింగ్ లు చేశాడు అలీ. ఇతనిని పట్టుకునేందుకు నవీ ముంబై.., పూణే ..,హైదరాబాద్ ..,బెంగళూరు ..సోలాపూర్ ..బీదర్ లో పోలీస్‌లు సెర్చ్ ఆపరేషన్ చేశారు.

సోలాపూర్ సమీపంలో పోలీసులకి భాకర్ అలీకి మధ్య చేజింగ్ జరిగింది. కొన్ని చోట్ల పోలీస్‌లపైకి భాకర్ అలీ దాడి చేసినట్టు చెబుతున్నారు. ఎట్టకేలకు అతనిని అరెస్ట్ చేసిన పోలీసులు.. అలీ నుండి గంజాయితో పాటు కార్లు స్వాధీనం చేసుకున్నారు.