పని ఉందంటూ తీసుకువెళ్లి.. పొలాల్లో అడ్డా కూలీపై అత్యాచారం, రాయితో మోది హత్యాయత్నం...
అడ్డాకూలీని పని ఉందంటూ తీసుకువెళ్లిన ఇద్దరు వ్యక్తులు.. ఆమె మీద అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తరువాత రాళ్లతో కొట్టి హత్యాయత్నం చేశారు.
శంషాబాద్ : హైదరాబాద్ లో రోజురోజుకూ మహిళల మీద అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. మహిళ ఒంటరిగా కనిపించినా, నలుగురిలో ఉన్నా.. ఏమార్చి, మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడుతున్నారు. తాజాగా Shamshabadలో అడ్డా నుంచి మహిళా కూలీని పని ఉందని చెప్పి.. తీసుకువెళ్ళిన కామాంధులు ఆమెపై molestationకి పాల్పడడంతో పాటు.. అంతమొందించే ప్రయత్నం చేశారు. స్థానికులు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ బాధితురాలు మృత్యువాత పడింది. ఈ దారుణం శంషాబాద్ మండల పరిధిలో బుధవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం మదనపల్లి తండాకు చెందిన ఓ మహిళ (40) దినసరి కూలీ. రోజులాగానే బుధవారం ఉదయం శంషాబాద్ లోని అడ్డా దగ్గర నిలబడింది. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు work ఉందంటూ ఆమె ను పిలిచారు.
ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని కవ్వ గూడ వ్యవసాయ పొలాల్లోని నిర్జన ప్రాంతానికి తీసుకువెళ్లి అత్యాచారం చేశారు. ఆ తరువాత బండరాయితో తలపై మోది పరారయ్యారు. రక్తపు మడుగులో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న బాధితురాలిని స్థానిక రైతులు గమనించి 100కు సమాచారం అందించారు. ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృత్యువాత పడిందని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. బాధితురాలి భర్త ఎనిమిదేళ్ల క్రితం మరణించాడు. ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడుని బాధితురాలు తన రెక్కల కష్టంతో పోషిస్తుంది. చిన్న కుమార్తెకు మూడు నెలల క్రితం వివాహం చేసింది. కుమారుడు ఇంటర్ చదువుతున్నాడు.
ఇదిలా ఉండగా, కన్నకూతురిని కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి మానవ మృగంలా మారాడు. తల్లిలేని ఆ పసిపాప ఆలనాపాలనా చూడాల్సినవాడే ఆ బంగారు తల్లి జీవితాన్ని సర్వనాశనం చేశాడు. వావి వరసలు మరిచి అభం, శుభం తెలియని ఆ 12 ఏళ్ల బాలికపై molestationకి పాల్పడ్డాడు. అత్యంత దారుణమైన ఈ ఘటన uttarpradeshలోని కన్నౌజ్ లో గురుసహాయ్ గంజ్ కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సోమవారం రాత్రి బాలిక తన అత్త వద్ద నిద్రపోతుండగా.. నిందితుడు ఆమెను బలవంతంగా వేరే గదిలోకి ఎత్తుకెళ్లాడు.
ఆ తర్వాత బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఆ సమయంలో బాలిక ఏడుపులు విన్న ఆమె అత్త కేకలు వేయడంతో పాటు పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే బాలిక తాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు. బాలికను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించినట్లు గురు సహాయ్ గంజ్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ రాజ్ కుమార్ సింగ్ తెలిపారు. పదేళ్ల క్రితమే బాలిక తల్లి చనిపోగా, అప్పటి నుంచి అదృశ్యమైన నిందితుడు నాలుగైదు రోజుల క్రితమే ఇంటికి వచ్చాడని పోలీసులు తెలిపారు.