టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో సిట్ దూకుడు: తుషార్‌కి నోటీసులు, విచారణకు రావాలని ఆదేశం

టీఆర్ఎస్  ఎమ్మెల్యేలకు ప్రలోభాల  కేసులో  తుషార్ కు  సిట్  బృందం  ఇవాళ నోటీసులు  జారీ చేసింది.  ఈ నెల 21  లోపుగా  విచారణకు  రావాలని సిట్ ఆ  నోటీసులో  పేర్కొంది.

Moinabad  Farm  house  Case:  SIT  Issues  Notice To  Thushar

హైదరాబాద్: మొయినాబాద్  ఫాం హౌస్  లో  ఎమ్మెల్యేల ప్రలోభాల  కేసులో  తుషార్ కు  సిట్  బృందం  గురువారంనాడు  నోటీసులు  జారీ చేసింది. ఈ నెల 21 లోపుగా  విచారణకు  రావాలని ఆ నోటీసులో  పేర్కొంది.  ఎమ్మెల్యేలకు  ప్రలోభాల  కేసులో  ఆరోపణలు  ఎదుర్కొంటున్న నిందితులు  తుషార్ పేరును ప్రస్తావించారు.  దీంతో  తుషార్ ను  విచారణకు  రావాలని సిట్  బృందం  ఆయనకు  నోటీసులు జారీ  చేసింది.

మొయినాబాద్  ఫాం హౌస్ లో ఎమ్మెల్యేలను ప్రలోభాలకు  గురి చేశారని రామచంద్రభారతి, సింహయాజీ,  నందకుమార్  లను  పోలీసులు  అరెస్ట్ చేశారు.ఈ కేసులో  అరెస్టైన  ఈ   ముగ్గురిని గత  నెల  26న  మొయినాబాద్  పోలీసులు  అరెస్ట్ చేసిన విషయం  తెలిసిందే.  ఈ కేసు  విచారించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిట్ ను  ఏర్పాటు  చేసింది. సిట్ కు  హైద్రాబాద్ సీపీ  సీవీ  ఆనంద్  నేతృత్వం  వహిస్తున్నారు.  సిట్  దూకుడుగా  ఈ కేసును  విచారిస్తుంది.  కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్  , హర్యానా  రాష్ట్రాల్లో  సిట్  విచారణ  చేస్తుంది. కేరళ రాష్ట్రంలో సిట్  సోదాలు నిర్వహించింది.  కేరళ రాష్ట్రంలో ఇద్దరిని సిట్  అదుపులోకి  తీసుకుంది. కేరళ రాష్ట్రంలో  ఓ డాక్టర్  కోసం సిట్  బృందం  గాలిస్తుంది. సిట్  విచారణకు  వస్తున్నారని  తెలుసుకున్న  డాక్టర్  పరారీలో ఉన్నాడు.  తుషార్  కి రామచంద్రభారతికి  ఈ  డాక్టర్ మధ్యవర్తిగా  వ్యవహరించారని  పోలీసులు  అనుమానిస్తున్నారు.రామచంద్రభారతి  తుషార్  పేరును ప్రస్తావించినట్టుగా  ఆడియో  సంభాషణల్లో  ఉంది. ఈ  నెలలో  తెలంగాణ సీఎం  కేసీఆర్  మీడియా సమావేశం  ఏర్పాటు చేసి న  సమయంలో  తుషార్ పేరును  కూడ  ప్రస్తావించారు.  కేంద్ర  హోంమంత్రితో  తుషార్  సమావేశమైన  ఫోటోను  కూడా  మీడియా సమావేశంలో  కేసీఆర్  చూపించిన  విషయం  తెలిసిందే. 

ఎమ్మెల్యేల ప్రలోభాల  కేసులో  రామచంద్రభారతికి  తుషార్ ను  జగ్గూ స్వామి  పరిచయం చేసినట్టుగా  సిట్   బృందం  గుర్తించింది.  జగ్గూ  స్వామీ  కోసం  పోలీసులు గాలింపు  చేపట్టారు. ఎమ్మెల్యేల ప్రలోభాల  కేసులో  కేరళ రాష్ట్రం కేంద్రంగా  ఆర్ధిక  లావాదేవీలు  జరిగినట్టుగా  కూడా  సిట్  అనుమానిస్తుంది.ఈ దిశగా  దర్యాప్తు  చేస్తుంది. 

ఎమ్మెల్యేల ప్రలోభాల వెనుక  బీజేపీ  ఉందని టీఆర్ఎస్ ఆరోపిస్తుంది.  టీఆర్ఎస్ ఆరోపణలను  బీజేపీ  తోసిపుచ్చింది.  ఈ కేసు  విచారణను నిలిపివేయాలని  బీజేపీ  హైకోర్టులో  పిటిషన్  దాఖలు  చేసింది.  సీబీఐతో  విచారణ చేయాలని   బీజేపీ  డిమాండ్  చేసింది.  అయితే సిట్  విచారణకు  మాత్రమే  హైకోర్టు  సానుకూలంగా  స్పందించింది. సీబీఐ  విచారణకు  అంగీకరించలేదు.  

also  read:నందుపై మరో మూడు చీటింగ్ కేసులు.. హీరో రానా ప్లాట్ ను లీజుకు తీసుకుని అక్రమనిర్మాణాలు...

మొయినాబాద్ పాం హౌస్  కేసు విచారణకు  సంబంధించి  సిట్   మరింత దూకుడుగా  వెళ్తోంది.  హైద్రాబాద్  డెక్కన్ కిచెన్  హోటల్  ను   గత  వారంలో పరిశీలించారు.  హోటల్ లోని సీసీటీవీ పుటేజీని  పోలీసులు  స్వాధీనం చేసుకున్నారు.  మరో వైపు ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో సింహయాజీకి  చెందిన ఆశ్ర మంలో  కూడా  సిట్   బృందం  సోదాలు నిర్వహించింది.  కేరళ రాష్ట్రంలోని  పలు  ప్రాంతాల్లో  సిట్  సభ్యురాలైన  నల్గొండ ఎస్పీ  రాజేశ్వరి  నేతృత్వంలో  బృందం  సోదాలు  నిర్వహించింది.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios