హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. టీం ఇండియా మాజీ కెప్టెన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మహ్మద్ అజారుద్దీన్ గుడ్ బై చెప్పేందుకు రెడీ అయ్యారని తెలుస్తోంది. 

మరో రెండురోజుల్లో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే మహ్మద్ అజారుద్దీన్ క్రికెట్ అనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించారు. కాంగ్రెస్ పార్టీ తరపున లోక్ సభకు ఎన్నికయ్యారు కూడా. 

ఇకపోతే తెలంగాణ ముందస్తు ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికల సమయంలో పార్టీ కోసం అహర్నిశలు శ్రమించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్టార్ కాంపైనర్ గా ఎన్నికల ప్రచారం నిర్వహఇంచారు. ఎన్నికల ప్రచార సమయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అజారుద్దీన్ ను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించిన సంగతి తెలిసిందే. 

తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓటమి పాలవ్వడంతో అజారుద్దీన్ అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఎలాంటి నిరసన కార్యక్రమాల్లో కూడా పాల్గొనలేదు అజారుద్దీన్.

ఇకపోతే ప్రస్తుతం మహ్మద్ అజారుద్దీన్ హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. శుక్రవారం జరిగిన హెచ్ సీఏ ఎన్నికల్లో అజారుద్దీన్ గెలుపు దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.