మన దేశం చాలా అసాధారణమైన ప్రతిభలకు నిలయం. ప్రతిభామూర్తుల సృజనాత్మకత ఇతరులకూ స్ఫూర్తినిస్తుంది. అలాంటి వారిలో తెలంగాణకు చెందిన డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య ఒకరు. ఆయన వయస్సు ఎనభై నాలుగు యేళ్లు. మీ కలలను సాకారం చేయడానికి వయసుతో సంబంధం లేదనేందుకు విటలాచార్యే నిలువెత్తు ఉదాహరణ... అంటూ మోడీ ప్రశంసించారు.
యాదాద్రి : తెలంగాణకు చెందిన డాక్టర్ Kurella Vithalacharya (84)ను ప్రధాని మోదీ అభినందించారు. తన గ్రామంలో Libraryన్ని నెలకొల్పాలన్న ఆయన సంకల్ప బలాన్ని కొనియాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలానికి చెందిన విఠలాచార్య గ్రంథాలయం స్థాపించాలన్న తన లక్ష్యాన్ని ఏవిధంగా కార్యరూపంలో పెట్టారో
Prime Minister Modi ఈ సందర్భంగా వివరించారు.
’మన దేశం చాలా అసాధారణమైన ప్రతిభలకు నిలయం. ప్రతిభామూర్తుల సృజనాత్మకత ఇతరులకూ స్ఫూర్తినిస్తుంది. అలాంటి వారిలో తెలంగాణకు చెందిన డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య ఒకరు. ఆయన వయస్సు ఎనభై నాలుగు యేళ్లు. మీ కలలను సాకారం చేయడానికి వయసుతో సంబంధం లేదనేందుకు విటలాచార్యే నిలువెత్తు ఉదాహరణ.
నేడే బండి సంజయ్ నిరుద్యోగ దీక్ష.. ఎక్కడంటే...
పెద్ద గ్రంధాలయాన్ని నెలకొల్పాలనే కోరిక విఠలాచార్యకు చిన్నప్పటి నుంచే ఉండేది. మన దేశానికి అప్పటికింకా స్వాతంత్ర్యం రాలేదు. కొన్ని పరిస్థితుల వల్ల చిన్న నాటి కల కలగానే మిగిలిపోయింది. కాలక్రమంలో విఠలాచార్య అధ్యాపకుడయ్యారు. తెలుగు భాషను అధ్యయనం చేశారు. రచనలు చేశారు. ఆరేళ్ల కిందట ఆయన తన కలను నెరవేర్చుకోవడం ప్రారంభించారు.
తన సొంత పుస్తకాలతో గ్రంథాలయాన్ని ప్రారంభించారు. తన జీవిత కాలా సంపాదనను గ్రంథాలయానికి ఖర్చు చేశారు. క్రమంగా ప్రజలు సహకరించడం ప్రారంభించారు. ప్రస్తుతం ఈ గ్రంథాలయంలో రెండు లక్షల పుస్తకాలు ఉన్నాయి. అధిక సంఖ్యలో విద్యార్థులు ఆ గ్రంధాలయం ద్వారా లబ్ధి పొందడాన్ని చూసి ఆయన చాలా సంతోషంగా ఉన్నారు. ఆయన స్ఫూర్తితో ఇతర గ్రామాల ప్రజలు కూడా గ్రంథాలయాలను నెలకొల్పే పనిలో నిమగ్నమై ఉన్నారు’ అని మోడీ అన్నారు.
నిత్య సాహితీ కృషీవలుడు విటలాచార్య..
భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన కూరెళ్ల విఠలాచార్య నిత్య సాహితీ కృషీవలుడు. అమ్మమ్మ గారి ఊరైన రామన్నపేట మండలం నీర్నెల గ్రామంలో విద్యాభ్యాసం చేశారు. 1955 లోనే ఎల్లంకిలో గ్రంథాలయాన్ని నడవలేక పోయారు. లెక్చరర్ గా రిటైర్మెంట్ తర్వాత ‘Acharya Kurella Trust’ను ఏర్పాటు చేసి వేలాది పుస్తకాలు సేకరించారు. నాలుగువేల గ్రంథాలతో 2014, ఫిబ్రవరి 13న అప్పటి నల్గొండ జిల్లా కలెక్టర్ చిరంజీవులుతో గ్రంథాలయాన్ని ప్రారంభించారు. స్వగృహాని గ్రంథాలయంగా మార్చి గ్రామానికి అంకితం చేశారు.
