సిద్ధిపేట:  కోహెడ ఇరువర్గాల మధ్య జరుగుతున్న ఘర్షణ ను ఆపడానికి ప్రయత్నించిన కోహెడ పోలీస్ స్టేషన్ కు చెందిన బ్లూకోట్ పోలీసులపై దాడి స్థానికంగా కలకలం రేపింది వివరాల్లోకి వెళితే కొహెడ మండ ల కేంద్రంలో బస్టాండ్ సమీపంలో శుక్రవారం రాత్రి గొడవ జరుగుతుందనే సమాచారం అందింది.

గొడవ జరుగుతుందన్న సమాచారం స్థానికులు 100 డయల్ చేసి సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో దాన్ని నియంత్రించడానికి వెళ్లిన బ్లూకోట్స్ కానిస్టేబుల్ మోహన్, లక్ష్మణ్ లపై గొడవకు కారణమైన నజీమొద్దిన్ తిరగబడి కొట్టడంతో మోహన్ అనే కానిస్టేబుల్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. 

గాయాలైన కానిస్టేబుల్ ను కరీంనగర్ అపోలో తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఎస్సై రాజ్ కుమార్ గాయాలైన మోహన్ ను కరీంనగర్ లోని అపోలో ఆస్పత్రికి  చికిత్స కోసం తరలించారు. కోహెడ ఎస్ఐ రాజకుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.