తనపై సహోద్యోగి పెట్టిన లైంగిక వేధింపుల కేసుతో అవమానానికి గురైన ఒక ఎంఎన్‌సీ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే, అభిషేక్ శర్మ అనే వ్యక్తి థానేలోని కపూర్‌బాడీ ఏరియాలో తల్లిదండ్రులు, భార్యతో కలిసి ఉంటున్నాడు.

ఈ క్రమంలో అభిషేక్ తనను లైంగికంగా వేధించడతో పాటు అశ్లీల చిత్రాలను పంపుతున్నాడంటూ.. అతనితో కలిసి పనిచేసిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అభిషేక్‌ను అరెస్ట్ చేశారు.

దీనిపై బెయిల్‌ పొందిన అతను కారులో ఇంటికి చేరుకున్నాడు. పోలీసులు కేసు పెట్టడంతో పాటు జైల్లో ఉండటంతో మనస్తాపానికి గురైన అభిషేక్ అపార్ట్‌మెంట్ టెర్రస్‌పైకి చేరుకున్నాడు. 25వ అంతస్తు నుంచి కిందకు దూకాడు.. అతనిని గమనించిన చుట్టుపక్కల వారు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికీ అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.