హైదరాబాద్: హైద్రాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుండి  టీఆర్ఎస్ అభ్యర్ధిగా బరిలో దిగిన వాణీదేవి విజయం సాధించారు.

మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు కూతురే సురభివాణీదేవి. ఎమ్మెల్యే ఎన్నికల్లో వ్యూహాత్మకంగా సురభివాణీదేవిని టీఆర్ఎస్ బరిలోకి దింపి రాజకీయంగా  ప్రత్యర్ధులపై పైచేయి సాధించింది.

ఆదివారం నాడు ఉదయం పీవీఘాట్ వద్ద సురభివాణీ తన తండ్రి సమాధి వద్ద నివాళులర్పించారు.ఇవాళ ఉదయం తన  నివాసం నుండి పీవీ ఘాట్ కు వెళ్లి నరసింహాదావు ఘాట్ వద్ద నివాళులర్పించారు. అక్కడే కొద్దిసేపు గడిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన మరునాడే ఆమె పీవీ ఘాట్ వద్దకు వెళ్లి నివాళులర్పించారు. 

సురభివాణీదేవిని బరిలోకి దింపడం ద్వారా రాజకీయంగా టీఆర్ఎస్ కు కలిసివచ్చిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.తెలంగాణలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకొంది. ఈ రెండు స్థానాల్లో విజయంతో రెట్టించిన ఉత్సాహంతో నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో ఆ పార్టీ ప్రచారం నిర్వహిస్తోంది.