తెలంగాణ మంత్రి వర్గ విస్తరణకు కేసీఆర్ ప్లాన్ చేశారని.. పట్నం మహేందర్ రెడ్డికి స్థానం కల్పిస్తారనే ఊహాగానాల మధ్య మహేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎల్లుండి ఉదయం 11.30 మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లు చెప్పారు.
తెలంగాణ మంత్రి వర్గ విస్తరణకు కేసీఆర్ ప్లాన్ చేశారని.. పట్నం మహేందర్ రెడ్డికి స్థానం కల్పిస్తారనే ఊహాగానాల మధ్య మహేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మధ్యాహ్నం గవర్నర్‌తో మాట్లాడారని.. కేటీఆర్ అన్ని సెట్ చేసి వెళ్లారని ఆయన తెలిపారు. ఎల్లుండి ఉదయం రాజ్‌భవన్‌లో 11.30కి ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లు చెప్పారు. గవర్నర్ హైదరాబాద్‌కు వచ్చే వరకు ఏం మాట్లాడను అని మహేందర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ప్రముఖ తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది.
కాగా.. తాండూరు టికెట్ కోసం పట్నం మహేందర్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డిల మధ్య వర్గపోరు నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే పైలట్ రోహిత్ రెడ్డికే ఈసారి కూడా టికెట్ కేటాయించారు కేసీఆర్. అయితే సీనియర్ నేత కావడం, టీడీపీలో వున్న రోజుల నుంచి తనకు సన్నిహితుడు కావడంతో పట్నంపై సీఎంకు సాఫ్ట్ కార్నర్ వుంది. ఈ క్రమంలోనే మంత్రివర్గంలో ఆయనకు చోటు కల్పించేందుకు కేసీఆర్ డిసైడ్ అయ్యారు.
