MLC Kavitha: "ఆ సర్వేలన్ని ఫేక్.. ప్రజలను తప్పుదోవ పట్టించడానికే ఇలా.."
Telangana Exit Polls Result 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో ప్రధాన ఘట్టమైన పోలింగ్ పర్వం ముగిసింది. ఇక ఫలితాలు వెలువడటమే తరువాయి. ఏ పార్టీ అధికార పగ్గాలు పట్టుకుంటుందో..? ఏ పార్టీ ఓటమి పాలవుతుందో డిసెంబరు 3న పార్టీల తలరాతలు డిసైడ్ కానున్నాయి. ఈ నేపథ్యంలో పోలింగ్ ముగిశాక వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేసింది.
MLC Kavitha: ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. పోలింగ్ ముగియగానే పలు సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించాయి. అయితే.. ఒకట్రెండు సర్వే సంస్థలు తప్ప మిగిత ఎగ్జిట్ పోల్స్ అన్ని కాంగ్రెస్ కే జై కొట్టాయి. కొన్ని ఎగ్జిట్ పోల్స్ మాత్రం హంగ్ వస్తుందనే అంచనా వేశాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు.
ప్రజలను తప్పదోవ పట్టించడానికేననీ, ఈ సర్వేలన్ని ఫేక్ అన్నారు.గురువారం జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ తల్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని, హ్యట్రిక్ ముఖ్యమంత్రిగా కేసీఆర్(CM KCR) చరిత్ర సృష్టించనున్నారని దీమా వ్యక్తం చేశారు.
రాహుల్ గాంధీ అన్నీ అబద్ధాలు చెబుతారని, తెలంగాణ ప్రజానీకం ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీని నమ్మడం లేదని స్పష్టం చేశారు. మధ్య ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ విఫలమైందని విమర్శించారు. తెలంగాణ ఉద్యమాల గడ్డని, చైతన్యవంతమైన ప్రజలు ఉండడం వల్లే ప్రజలకు మేలు చేసే ప్రతినిధులు ఉండాలని ప్రజలే నిర్ణయించుకుంటారని అన్నారు. క్షేత్రస్థాయి నుంచి తమకు అందుతున్న సమాచారం ప్రకారం బీఆర్ఎస్ (BRS) పార్టీకి సానుకూల ఫలితాలు వెలువడుతాయని పేర్కొన్నారు.
ప్రజలను తప్పదోవ పట్టించడానికి సర్వేలనీ, ఈ సర్వేలన్ని ఫేక్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో గులాబీ విప్లవం కనిపించిందని, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ దాదాపు 100 స్థానాలు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు మంచి చేసేవాళ్లే అధికారంలో ఉండాలని, ప్రజలను తప్పుదోవ పట్టించేవాళ్లు ఉండరాదని ఓటర్లు నిర్ణయానికి వచ్చినట్టుగా అర్థమవుతుందని వ్యాఖ్యానించారు. తెలంగాణ సీఎంగా కేసీఆర్ గారు హ్యాట్రిక్ సాధించబోతున్నారని, ఆ విషయంలో ఎలాంటి సందేహం లేదని కవిత పేర్కొన్నారు.తెలంగాణ ప్రజలు మరోసారి బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించి, మరోసారి చరిత్ర సృష్టించబోతున్నారని పేర్కొన్నారు.