దేశంలో ఎన్నికల సంస్కరణలు చేపట్టాలి: ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha: లండన్ పర్యటనలో ఉన్న ఎమ్మెల్సీ కవిత నేషనల్ ఇండియన్ స్టూడెంట్స్ అండ్ అలుమ్ని అసోసియేషన్ - UK (NISAU) సభ్యులతో ఇంటరాక్షన్ అయ్యారు. ఈ విస్తృత చర్చలో ఆమె మహిళా రిజర్వేషన్, తెలంగాణ అభివృద్ధి, తన రాజకీయ ప్రయాణంపై గురించి పంచుకున్నారు.
MLC Kavitha: భారత దేశంలో ఎన్నికల సంస్కరణలు చేయాల్సిన ఆవశ్యకత ఉందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్‌లను డీలిమిటేషన్ ప్రక్రియతో అనుసంధానించే కేంద్రం ఎలాంటి చర్యను వ్యతిరేకించారు. తెలంగాణ చరిత్రలో స్వర్ణ యుగానికి నాంది పలికిన ఘనత బీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని, పలు రంగాల్లో అగ్రగామిగా నిలిచిందని ఆమె పేర్కొన్నారు .
లండన్ పర్యటనలో ఉన్న కవిత నేషనల్ ఇండియన్ స్టూడెంట్స్ అండ్ అలుమ్ని అసోసియేషన్ - UK (NISAU) సభ్యులతో సంభాషించారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలు సమాధానాలు ఇచ్చారు. మహిళా రిజర్వేషన్, తెలంగాణ అభివృద్ధి, తన రాజకీయ ప్రయాణంపై అనుభవాలను పంచుకుంటూ విస్తృత చర్చలో నిమగ్నమయ్యారు.
మహిళా రిజర్వేషన్ల సమస్యలను కవిత ప్రస్తావించారు, రాజకీయాల్లో మహిళలకు అవకాశాలు కల్పించేందుకు చట్టబద్ధమైన చర్యలు కీలకమని ఉద్ఘాటించారు. వివిధ రాజకీయ పార్టీల మద్దతును కూడగట్టుకుని మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం తాము క్రియాశీల ప్రచారాన్ని నిర్వహించనని తెలిపారు. మహిళా రిజర్వేషన్‌ను డీలిమిటేషన్‌తో అనుసంధానించే ప్రతిపాదనలకు ప్రతిస్పందనగా.. దేశంలో ఎన్నికల సంస్కరణల అవసరమని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆమె ప్రపంచవ్యాప్తంగా లింగ వివక్ష గురించి ఆందోళన వ్యక్తం చేశారు. సమాన అవకాశాల ఆవశ్యకతను కూడా నొక్కి చెప్పారు.
ఈ సందర్భంగా పౌరుల సామాజిక-ఆర్థిక స్థితిని పెంపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటించారు. రాష్ట్రం ఏర్పడిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సర్వేలు నిర్వహించిందని, మత్స్యకారులు, గొర్రెల కాపరులు తదితర సంప్రదాయ వృత్తులపై ఆధారపడిన వారి కోసం వివిధ పథకాలను ప్రారంభించేందుకు దోహదపడిందని ఆమె అన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం కులవృత్తుల వారికి అనేక ప్రోత్సాహకాలు అందిస్తూ ప్రోత్సహిస్తోందన్నారు.
కేసీఆర్ కిట్‌ల వంటి పథకాలు సంస్థాగత ప్రసవాలను ప్రోత్సహించడానికి ఉపయోగపడుతున్నాయనీ, అలాగే.. మాతా,శిశు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడ్డాయని తెలిపారు..ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం అందిస్తున్న అత్యధిక జీతాలు, ట్రాఫిక్ కానిస్టేబుళ్లకు రిస్క్ అలవెన్సులు, అంగన్‌వాడీ కార్యకర్తలకు పోటీ పరిహారాన్ని కూడా ఆమె హైలైట్ చేశారు.
తెలంగాణ విద్యా వ్యవస్థలో కూడా సమూల మార్పులు వచ్చాయని, క్రీడలను కూడా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. అలాగే.. తెలంగాణ ప్రభుత్వం షీ టీమ్స్ వంటి కార్యక్రమాల ద్వారా మహిళల భద్రతకు కృషి చేస్తోందని, సమాజంలోని అన్ని వర్గాల వారిని మరింత కలుపుకొని పోయేందుకు అవకాశం కల్పించాలని పేర్కొన్నారు.