Asianet News TeluguAsianet News Telugu

నీకు ఉద్యోగం, పిల్లలను చదివిస్తా: చైనా లోన్‌యాప్ బాధిత కుటుంబానికి కవిత భరోసా

కష్టాల్లో ఉన్న వారికి నేనున్నానంటూ  ముందుకొచ్చే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత.. మరోసారి తన‌ మానవత్వాన్ని చాటుకున్నారు. చైనా లోన్ యాప్‌ల వేధింపులకు బలైన కుటుంబానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బాసటగా నిలిచారు.

mlc kavitha helps to china loan app victims ksp
Author
Hyderabad, First Published Feb 28, 2021, 7:11 PM IST

కష్టాల్లో ఉన్న వారికి నేనున్నానంటూ  ముందుకొచ్చే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత.. మరోసారి తన‌ మానవత్వాన్ని చాటుకున్నారు. చైనా లోన్ యాప్‌ల వేధింపులకు బలైన కుటుంబానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బాసటగా నిలిచారు.

ఉద్యోగంతో పాటు, ముగ్గురు కుమార్తెలను ఉన్నత చదువులు చదివించే బాధ్యతను తీసుకుంటానని బాధితుడి భార్య సరితకు కవిత హామీ ఇచ్చారు. మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లికి చెందిన చంద్రమోహన్, చైనా లోన్ యాప్‌ల వేధింపులను భరించలేక గత నెలలో ఆత్మహత్య చేసుకున్నాడు.

తీసుకున్న అప్పు కంటే ఆరు రెట్లు చెల్లించినా, ఇంకా పదే పదే ఫోన్లు చేసి వేధిస్తుండటంతో చంద్రమోహన్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో చంద్రమోహన్ భార్య సరిత, ముగ్గురు ఆడపిల్లల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది.

mlc kavitha helps to china loan app victims ksp

విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ కవిత, చంద్రమోహన్ కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. దీనిలో భాగంగా ఆదివారం హైదరాబాద్‌లో బాధితుడి భార్య సరిత, అతని ముగ్గురు పిల్లలు కవితను కలిసారు.

సరితను ఓదార్చిన ఎమ్మెల్సీ కవిత, అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ముగ్గురు పిల్లలు ఉన్నత చదువులు చదివి, ఉద్యోగాలు సాధించేవరకూ  సాయం అందిస్తానని భరోసానిచ్చారు.

ఎప్పుడు ఏ సమస్య వచ్చినా, వెంటనే తనను సంప్రదించాలని ఎమ్మెల్సీ కవిత సరితకు భరోసానిచ్చారు. తన కుటుంబాన్ని ఆదుకుని, పూర్తిగా అండగా ఉంటానని హామి ఇచ్చిన కవితకు చంద్రమోహన్ కుటుంబసభ్యులు ధన్యవాదాలు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios