Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ పాలనలో సర్వమతాలకు ప్రాధాన్యత: కవిత

రాష్ట్రంలో అన్ని మతాలకు ప్రాధాన్యత ఇచ్చిన ఉన్నతమైన వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ప్రీ క్రిస్ మస్ వేడుకల్లో భాగంగా బోడుప్పల్‌లోని చెరిష్ ఫౌండేషన్ లో జరిగిన కేక్ మిక్సింగ్ కార్యక్రమంలో కవిత పాల్గొన్నారు. 

mlc kalvakuntla kavitha participated in pre christmas celebrations in hyderabad ksp
Author
Hyderabad, First Published Dec 19, 2020, 9:36 PM IST

రాష్ట్రంలో అన్ని మతాలకు ప్రాధాన్యత ఇచ్చిన ఉన్నతమైన వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ప్రీ క్రిస్ మస్ వేడుకల్లో భాగంగా బోడుప్పల్‌లోని చెరిష్ ఫౌండేషన్ లో జరిగిన కేక్ మిక్సింగ్ కార్యక్రమంలో కవిత పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్రం సమగ్ర అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. చెరీష్ ఫౌండేషన్‌లో ఉన్న 45 మంది బాలబాలికల చదువులకు సహకారం అందిస్తానని కవిత ప్రకటించారు.

గత 16 ఏళ్లుగా చెరీష్ ఫౌండేషన్‌ను నిర్వహిస్తూ అనాధ పిల్లలకు ఆశ్రయమిస్తున్న డేవిడ్ సుబ్రమణ్యాన్న ఆమె అభినందించారు. ఆశ్రమంలో ఉన్న 45 మంది బాల బాలికలు తన కుటుంబ సభ్యులతో సమానం అన్నారు. అలాగే ఆశ్రమానికి సొంత స్థలం కేటాయించేందుకు ప్రయత్నిస్తానని కవిత హామీ ఇచ్చారు.

ఫౌండేషన్‌లో ఆశ్రయం పొందుతున్న బాలబాలికలు ఉన్నత చదువులు చదువుకుని, ఉద్యోగాలు సాధించేందుకు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తానని మంత్రి మల్లారెడ్డి ప్రకటించారు. ప్రీ క్రిస్‌మస్ వేడుకలను పురస్కరించుకుని బాలబాలికలు ప్రార్థనలు, భక్తి గీతాలు ఆలపించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios