Asianet News TeluguAsianet News Telugu

కల్వకుంట్ల కవిత ఆపన్న హస్తం.. ముగ్గురు దివ్యాంగులకు స్కూటీలు..

ఆపన్నులను అందుకోవడంలో ముందుండే ఎమ్మెల్సీ ‌కల్వకుంట్ల కవిత, మరోసారి గొప్ప మనసును చాటుకున్నారు. విధివంచితులై దివ్యాంగులుగా మారిన ముగ్గురు యువకులకు చేయూతనిచ్చారు ఎమ్మెల్సీ ‌కవిత. వివిధ ‌కారణాల వల్ల దివ్యాంగులుగా మారిన కరీంనగర్ కు చెందిన శ్రీనివాస్, మహబూబ్ నగర్ కు చెందిన నరేష్, సుల్తానాబాద్ కు చెందిన ఉమా మహేష్ లకు హైదరాబాద్ లో మూడు చక్రాల స్కూటీలను ఎమ్మెల్సీ కవిత అందజేసారు. 

mlc kalvakuntla kavitha gave three scootys to handicapped in hyderabad - bsb
Author
Hyderabad, First Published Mar 22, 2021, 3:25 PM IST

ఆపన్నులను అందుకోవడంలో ముందుండే ఎమ్మెల్సీ ‌కల్వకుంట్ల కవిత, మరోసారి గొప్ప మనసును చాటుకున్నారు. విధివంచితులై దివ్యాంగులుగా మారిన ముగ్గురు యువకులకు చేయూతనిచ్చారు ఎమ్మెల్సీ ‌కవిత. వివిధ ‌కారణాల వల్ల దివ్యాంగులుగా మారిన కరీంనగర్ కు చెందిన శ్రీనివాస్, మహబూబ్ నగర్ కు చెందిన నరేష్, సుల్తానాబాద్ కు చెందిన ఉమా మహేష్ లకు హైదరాబాద్ లో మూడు చక్రాల స్కూటీలను ఎమ్మెల్సీ కవిత అందజేసారు. 

కరీంనగర్ జిల్లా కుమ్మర్ పల్లికి చెందిన శ్రీనివాస్ వెన్నెముక సమస్యతో బాధపడుతూ, నడవలేని స్థితిలో ఉన్నాడు. కుటుంబాన్ని పోషించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న శ్రీనివాస్ పరిస్థితి గురించి అతని స్నేహితుడు ట్వీట్ చేశారు.  ట్విట్టర్ ద్వారా శ్రీనివాస్ పరిస్థితి తెలుసుకున్న ఎమ్మెల్సీ కవిత, అతని కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. సోమవారం ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ లో  శ్రీనివాస్ కు స్కూటీని అందజేసారు.

సుల్తానాబాద్ మండలం కంఠినెపల్లి గ్రామానికి చెందిన ఉమా మహేష్, మహబూబ్ నగర్ జిల్లా మార్కెల్ గ్రామానికి చెందిన నరేష్  దురదృష్టవశాత్తు జరిగిన రోడ్డు ప్రమాదాల్లో రెండు కాళ్ళూ తీవ్రంగా దెబ్బతిని, వీల్ చైర్ కే పరిమితం అయ్యారు. ట్విట్టర్ ద్వారా ఉమా మహేష్, నరేష్ ల దీనస్థితి గురించి తెలుసుకున్న ఎమ్మెల్సీ కవిత, స్కూటీలు అందించి చేయూతనిచ్చారు. 

ముగ్గురికి మూడు చక్రాల స్కూటీని అందించిన ఎమ్మెల్సీ కవిత, ఎలాంటి సమస్య వచ్చినా అధైర్య పడొద్దని, అన్ని విధాలా అండగా ఉంటానని వారి కుటుంబ సభ్యులకు  భరోసానిచ్చారు. సోషల్ ‌మీడియా లో పెట్టిన విజ్ఞప్తికి వెంటనే స్పందించడంతో పాటు, సాయం అందించి అండగా నిలిచిన ఎమ్మెల్సీ కవితకి వారంతా కృతజ్ఞతలు తెలిపారు.

ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ కవిత జన్మదినం సందర్భంగా వారి అభిమానులు 30 మంది విద్యార్థులకు సైకిళ్లు, ఆరుగురు దివ్యాంగులకు స్కూటీలను అందించారు.

Follow Us:
Download App:
  • android
  • ios