తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాజకీయాలు తెలంగాణలో చెల్లవని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. టీడీపీకి మళ్లీ ప్రాణం పోయాలనుకుంటే ప్రజలు తిరస్కారిస్తారని చెప్పారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాజకీయాలు తెలంగాణలో చెల్లవని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. టీడీపీకి మళ్లీ ప్రాణం పోయాలనుకుంటే ప్రజలు తిరస్కారిస్తారని చెప్పారు. చుక్కలు ఎన్ని ఉన్నా చందమామ ఒక్కటే ఉన్నట్టే.. ఎన్ని పార్టీలు వచ్చినా తెలంగాణలో కేసీఆర్ ఒక్కరే ప్రజల గుండెల్లో ఉండే వ్యక్తి అని అన్నారు. చంద్రబాబు నాయుతో పాటుగా మరెవరూ కూడా ఇక్కడి ప్రజలకు శ్రేయస్సు కాదని అన్నారు. తెలంగాణ ప్రజలు సరైన సమయంలో సరైన సమయంలో తీసుకుంటారని చెప్పారు. 

ఇక, కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతు వ్యతిరేకి అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. కేంద్రం విధానాలకు వ్యతిరేకంగా రైతులంతా మహాధర్నాలో పాల్గొని మహాధర్నాను విజయవంతం చేయాలని కవిత కోరారు. నిజామాబాద్ రైతుల సత్తా ఏమిటో చూపించాలని అన్నారు. 
తెలంగాణలో కేసీఆర్ పనికొచ్చే కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు మిగతా రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉన్నాయా? అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌కు ప్రతి రాష్ట్రం నుంచి అద్భుతమైన స్పందన వస్తోందన్నారు. దేశంలో విప్లవత్మాక మార్పులు తీసుకోస్తామని ధీమా వ్యక్తం చేశారు. పాత భవనాల కూల్చివేతపై బీజేపీవి అనవసర ఆందోళనలని మండిపడ్డారు.