Asianet News TeluguAsianet News Telugu

కవి సోమన్నపై ఎమ్మెల్యే భార్య పుష్ప ఇలా అన్నారు

  • ఈ సోమయ్య అనే వాడు మరో డేరా బాబా
  • 18 మంది మహిళలతో ఆడుకున్నాడు
  • ఐదు నెలలకు ఒకరిని వాడుకుంటున్నాడు
  • మూడో భార్యను తీసుకురాకపోతే చస్తానని బెదిరించాడు
  • జెఎసి, లెఫ్ట్, కాంగ్రెస్, టిడిపి ఎందుకు సోమన్నకు సపోర్ట్ చేస్తున్నారు
  • బహిరంగ చర్చకు నేను సిద్ధం
mla wife puspa calls epuri somanna a dera baba

తెలంగాణ కవి, గాయకుడు ఏపూరి సోమన్నకు బేడీలేయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నకిరేకల్ ఎమ్మెల్యే సతీమణి పుష్ప అలియాస్ పుష్పారెడ్డి స్పందించారు. ఆమె ఎందుకు అలా వ్యవహరించాల్సి వచ్చిందో వివరిస్తూ ఒక సందేశాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఆ పోస్టు వైరల్ అవుతోంది. ఆమె చేసిన పోస్టు ఇదే.

 

సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న సోదరులారా రాజకీయ నాయకులారా
JAC సోదరులారా
లెప్టిస్ట్ భావాలతో ఉన్న సోదరులారా మిము మా జీవితాలు ప్రజల కోసం అని చెప్పుకునే సోదరులారా ...
వాస్తవాలను ప్రజలకు చెప్దామనే మీడియా యాజమానులరా
పాత్రికేయులరా ...మీరు ఎటు వైపు ఎవరి పక్షం ...
నీను పుష్పగా ఒక మహిళ గా వేసే ప్రశ్న లకు సమాధానం చెప్పండి
చర్చ వేదికలు చర్చ లు Facebook లలో Whatsapp లలో కాదు ...
తిరుమలగిరి Sc కాలనీకి సోమయ్య సొంత ఊరికి పోదాం రండీ ! .వాస్తవాలు తెలుస్తాయి.....
ఒకరిని పెళ్ళి చేసుకుని చాలదని ఇంకొరిని చేసుకొని అది చాలదని ఇంకొక విడో తో సాహజీవనం చేసి మళ్ళి విడో ని వదిలేసి ఇప్పుడు ఇంకోక పెళ్ళి అయి పిల్లలున్న మహిళ సంసారం కూల్చి పెళ్ళి చేసుకున్నాడు. దీనిని మీరు ఆమోదించాలి లేకుంటే నిను చస్తాను అని మిగితా భార్యలను వేదిస్తుంటే ఏమి చేయాలి వాళ్ళు. వీళ్ళే కాకా ఇంకొక 18 మంది మహిళల జీవితాలతో 5 నెలలకు ఒకరిని చొప్పున వాడుకుంటుంటే ఏమనాలి వీడిని. దీన్ని ఉత్తమ కుమారు ఎలా సమర్దిస్తాడు రేవంత్ ఎలా సమర్దిస్తాడు. ప్రగతి శీల భావాలున్న లెఫ్ట్ భావాలున్న వాళ్లు ఎలా సమర్థిస్తారు చెప్పండి. ఇతని బలహీనత లను కాపాడే అవసరం మీకు ఎందుకొచ్చింది దీని వెనకాల మీ స్వార్థం ఏమిటో అర్థం కావడం లేదు.

ఎక్కడైనా మహిళలకు అన్యాయం అయ్యిందంటె మద్దత్తు ఇచ్చే పార్టీలు సంగిభావం తెలిపే పార్టీలు ఉద్యమించే ప్రగతిశీల భావాలూ గల వ్యక్తులు శక్తులు కమ్యూనిస్టులు ఎందుకు ఈ వ్యభిచారికి సపోర్ట్ చేస్తున్నారు. వీని బిడ్డా పెండ్లి ఈడుకు వస్తుంది 15 లక్షలు ఇస్తా అని బాండ్ రాసి ఇచ్చాడు ఇవి రేవంత్. ఉత్తమ్ .జే ఏ సి . సుధాకర్ ఇస్తానని నమ్మించిండు అవి ఈవ్వకపోగా రోజుకో కొత్త పెళ్ళి చేసుకోవడం దీనిని ఎలా సమర్దిస్తారు. దీనిని రాజకీయం చేస్తుంటే తిరుమలగిరి లో జనం నవ్వుతున్నారు. ఈ వ్యభిచారి పక్షాన ఇంతగా వత్తసా ? అని. నిను ఇక్కడ వాడిన ప్రతి పదానికి బహిరంగ విచారణకు సిద్ధం గా ఉన్న భాదితులు కూడా సిద్ధంగా ఉన్నారు.

రాజకీయపార్టీలు .జె ఏ సీ. మీడియా.లెఫ్ట్ బావాలు కలిగిన వాళ్లు సిద్ధమేనా? బేడీలు వేసినారు సర్కారు వేసింది అని దేనికి వేసినారు? వీడు చస్తా మందుతాగుతా ఊరి పెట్టుకుంటా అని స్టేషన్ లో చేసిన సైకో చేతలకు వాళ్ళ భార్య పిర్యాదు మేరకు వాన్ని కంట్రోల్ చేయడానికే. ఆ పరిస్థితులలో వాళ్ల బార్య లకు ఎవరు సహకరించక పోతే మెదటిభార్య రెండవ భార్య కళాకారిణులే వాళ్ళు నాకు 10 సార్లు ఫోన్ చేసి సాటి మనిషి గా తొటి కళాకారుడు చేసుకుంటున్న కుటుంభ నాశనాన్ని ఆపీ నా తోటి కళాకారుల కుటుంబాన్ని నిలబెడుదమని స్టేషన్ కి పోయి సోమన్నను ఒప్పిచ్చి ఇద్దరు భార్యలు .నీను .కప్పల వసంత .పల్స నిర్మల అను మిము జమానతి వహించి స్టేషన్ నుండి విడిపించి ఇద్దరూ భార్యలు నలుగురు పిల్లలతోటి మంచిగా ఉండమని చెప్పి 3 వ ఆమెను వదిలెయ్యమని చెప్పి వచ్చినాము. కానీ మీము మీడియాకు ఎక్కించ దలుచుకోలేదు కుటుంబాన్ని ఆడవాళ్ళ జీవితాలను నిలబెట్టధలుచుకున్నాం కానీ ఏ దురుద్దేశం లేదు ఆ తరువాత ఇంటికి వెళ్ళిన సోమయ్య రోజంతా తాగి బట్టలు లేకుండా బజార్లో పొర్లిన సంగతి ఇంకొక పెళ్ళాన్ని తీసుకురాకుంటే చస్తానని బెదిరించిన సంగతి ఆ ప్రాంత ప్రజలకు తెలుసు మీరు రండి వాస్తవాలు తెలుస్తాయి కానీ ఏ వాస్తవాలు ఏమి తెలువకుండా మాట్లాడటం మికు ఏ విదంగా తగునో సమాధానం చెప్పండి.

నీను ఓక అడపిల్లనే గత 20 సం^ లు గా ఆడవాళ్ళ పక్షాన న్యాయం కోసం కొట్లాడుతున్న .MLA భార్యని అయ్యి 3 సం^ లే కానీ అంత ముందు 17 సం^లు వాళ్ళకోసమే మాట్లాడిన ఉద్యమించిన. అదే స్ఫూర్తి తో నా చివరి రక్తం బొట్టూ అరే వరకు అడపిల్లలకు అన్యాయం జరిగితే తప్పకుండా స్పందిస్తా ఆది సోమయ్య అయినా ఇంకేవరైన మీరేం చేస్తారో చెప్పండీ
మహిళా సంఘాల అక్కలకు నా విఙ్ఞప్తి, ఈ సోమయ్య అనే వాడు మరో డేరా బాబా .మరొక పాటల బాబా ను నిలదీసే ఆడవాళ్ళు మన మాన ప్రాణాలను కాపాడుకోవడం కోసం ముందుకు రావాలని విఙ్ఞప్తి. అన్ని పార్టీల నాయకులు జేఏసీ తమ మగ బుద్ధిని చాటుకుంటుంన్నాయీ దీనిపై ఒక విచారణకమిటి వేసి వాస్తవాలని బయటకి తీయాలని మీ మీద నమ్మకం తో విఙ్ఞప్తి.

నా భర్త అధికారపార్టీ కాబట్టి నిను అయన భార్యను కాబట్టి ఎదో బదనామ్ చేద్దాం అనుకుంటే నిజం నిప్పు లాంటిది ఎప్పటికైనా వాస్తవాలు బయటకివస్తాయి.
చివరిగా రాజకీయ పార్టీలకు . జే ఏ సీ ఉద్యమకారులకు.అవగాహన ఉన్న లెప్టిస్ట్ లకు మీరు బహిరంగ చర్చకు అయినా బహిరంగ విచారణకు ఆయన సిద్ధం కండి నిను సిద్ధమే తిరుమలగిరి లో అయినా వెలిశాలలో అయినా హైద్రాబాద్ లో అయినా కానీ అబద్దాలు అవస్తవాలు ఒక కామ పిశాచి కోసం మాట్లాడి రాజకీయవిలువలను దిగజార్చకండి..
నేను ఒక SC ని పెండ్లి చేసుకుంటే నా కులం నా కుటుంబాన్ని 5.6 సం^ లు వెలివేసినట్టుగా చూసిన కుల అంతరాలు కులాలి అని నిను వీరేశం ని పెండ్లి చేసుకున్న నేను SC ని అని గర్వము గా చెప్పుకుంటా అలాంటి నాపై SC యాక్టు కేసు పెట్టడం చాల సంతోషం గా ఉంది. మీ రాజకీయ విలువలు ఏంటో వ్యభిచారి పట్ల మీ వైఖరి ఏంటో నాకు అర్ధం అయ్యిన్ది నిను అ ఇద్దరు మహిళలకు న్యాయం జరిగేవరకు తప్పకుండా వాళ్ళ పక్షాన ఉంటా మద్దతుగా నిలబడుతా.


నేను రాసినదానికి రాజకీయపార్టీలు జే ఏ సీ నేతలు లెఫ్ట్ వాదం తో ఉన్న వాళ్ళు సమాధానం చెప్పాలి ఇదే మన కుటుంబ సభ్యులకు మన ఊరి వాళ్ళకి జరిగితే ఎం చేస్తారో చెప్పండి 55% రిజర్వేషన్ 50% రిజర్వేషన్లు అనేమీరు వ్యభిచారుల పక్షం వహిస్తూ మీ మగ బుద్ధిని చాటుకుంటారా నిజం కాదా సమాధానం చెప్పండి కనీసం మహిళల పట్ల బాధితుల పట్ల సానుభూతిఅయినా చూపరా? హైద్రాబాద్ లోని ముషీరాబాద్ లో కేసు పెడితే పట్టించుకోలేదు తిరుమలగిరిలో పట్టించుకోలేదు వాళ్ళకి దిక్కేవరు మీ లాంటి వాళ్ళు ఉన్న కాడా మానబంగాలు ఎందుకు జరగవు అడపిల్లల మానాలకు రక్షణ ఏది.

ఓఓ ఇధ మీ విధానం ఆలోచించండి వాస్తవాలు తెలుసుకొని రియలేజ్ కండి.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

Follow Us:
Download App:
  • android
  • ios